Site icon HashtagU Telugu

Garuda Buses: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రయ్ రయ్!

Ac Buses

Ac Buses

ప్రయాణికుల పరిరక్షణే ధ్యేయంగా, ఆర్టీసీ మనుగడ కోసం TSRTC అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్టీసీ లాభాల్లో తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ బస్సులకు దీటుగా కొత్త టెక్నాలతో కూడిన బస్సులను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహానాలకు ప్రాధాన్యం పెరగడంతో తెలంగాణ ఆర్టీసీ కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రయాణికులకు అదిరిపొయే గుడ్ న్యూస్ చెప్పింది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికుల కోసం త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని TSRTC నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’గా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం  4.30 గంటలకు ఈ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ “ఈ-గరుడ”  (Garunda) బస్సులు ప్రారంభమవుతాయి.

Also Read: Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!