Site icon HashtagU Telugu

TSRTC : అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌మాణికుల‌కు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్‌

Telangana RTC

Tsrtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సహకారం (టీఎస్‌ఆర్‌టీసీ) ప్ర‌యాణికులకు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణంలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే వారికి రాయితీలను ప్రకటించింది. 31 రోజుల (నెల) నుండి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే, టిక్కెట్‌పై 5 శాతం తగ్గింపు ఉంటుంది. 46 రోజుల నుండి 60 రోజుల ముందు బుక్ చేసుకుంటే 10 శాతం త‌గ్గింపు ఉంటుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. TSRTC, నల్సాఫ్ట్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) అమలుతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. దేశంలోని అన్ని స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ సంస్థల్లో దీన్ని కమీషన్‌ చేసి అమలు చేయడంలో టీఎస్‌ఆర్‌టీసీ మొదటి స్థానంలో ఉందని టీఎస్‌ఆర్‌టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, నల్‌సాఫ్ట్‌ సీఈవో సీఏ వెంకట నల్లూరి టీఎస్‌ఆర్‌టీసీ, నల్‌సాఫ్ట్‌ల మధ్య ఎంఓయూపై సంతకాలు జరిగాయి.