Site icon HashtagU Telugu

TSRTC : టీఎస్ఆర్టీసీలో ప్ర‌యాణిచండి.. 11ల‌క్ష‌లు గెలుచుకోండి.. ల‌క్కీ డ్రాను ప్ర‌క‌టించిన టీఎస్ఆర్టీసీ

TSRTC

Tsrtc

దసరా ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సు వినియోగదారులకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశంతో కూడిన లక్కీ డ్రాను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 23, అక్టోబర్ 28 నుంచి 30 మధ్య బస్సులలో ప్రయాణించే ప్రయాణికులందరూ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణీకులు తమ పూర్తి పేరు, ఫోన్ నంబర్‌ను టికెట్ వెనుక భాగంలో వ్రాసి.. ప్రయాణం పూర్తయిన తర్వాత బస్టాప్‌లలో డ్రాప్ బాక్స్‌లలో వేయాలని తెలిపింది. బస్టాండ్లలో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయ‌నుంది. మొత్తం 110 మందికి ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేయనున్నారు. ఒక్కో ప్రాంతానికి ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలకు రూ.9,900 చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు. తెలంగాణ నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తారు. ఆయా తేదీల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ లక్కీ డ్రాకు అర్హులు ఆర్టీసీ తెలిపింది. బతుకమ్మ, దసరా పండుగ‌ల సమయంలో ప్రయాణీకులకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా అక్టోబర్ 13 నుండి 24, 2023 వరకు 5,265 ప్రత్యేక బస్సులను నడపనుంది. గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 1000 బస్సులు నడపనున్నారు.

Also Read:  Durga Temple EO : దుర్గ‌గుడిలో ఈవో సీటుపై లొల్లి.. కొత్త ఈవోకి బాధ్య‌త‌లు ఇవ్వని పాత ఈవో