TSPS : ఈడీ, సీబీఐకి పేప‌ర్ లీక్ ఎపిసోడ్‌, రాజ‌కీయ దుమారం

గోరుచుట్టుపై రోక‌టిపోటులా ఇప్పుడు టీఎస్పీఎస్ (TSPS) పేప‌ర్ లీకు స్కామ్ ను ఎమ్మెల్సీ క‌విత(Kavitha) వైపు విప‌క్ష లీడ‌ర్లు మ‌ళ్లించారు.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 04:54 PM IST

గోరుచుట్టుపై రోక‌టిపోటులా ఇప్పుడు టీఎస్పీఎస్ (TSPS) పేప‌ర్ లీకు స్కామ్ ను ఎమ్మెల్సీ క‌విత(Kavitha) వైపు విప‌క్ష లీడ‌ర్లు మ‌ళ్లించారు. ఆ మేర‌కు సీబీఐ, ఈడీకి కాంగ్రెస్ లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్( కాంగ్రెస్ యావ‌రేజ్ లీడ‌ర్ ) రాత‌పూర్వ‌క ఫిర్యాదును అందించారు. గతంలో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌తో పాటు తాజాగా జ‌రిగిన గ్రూప్ 2 పేప‌ర్ లీకు వ‌ర‌కు ప‌లు ఆధారాల‌ను జోడిస్తూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నార‌ని భ‌య‌ప‌డుతోన్న‌ కవిత ను బహిరంగ విచారణ చేయాలని ఈడీని కోరారు. ఇంకో వైపు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ దీక్ష‌కు దిగారు. పేప‌ర్ లీకు వ్య‌వ‌హారంలో క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించారు. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పేప‌ర లీకు ఎపిసోడ్ మీద సిట్టింగ్ జ‌డ్జి తో విచార‌ణ జ‌రిపించాల‌ని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌, బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ దీక్ష‌ల‌కు దిగారు. విప‌క్ష లీడ‌ర్ల దీక్ష‌ల‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. కాంగ్రెస్ లీడ‌ర్ జ‌డ్స‌న్ మాత్రం సీబీఐ, ఈడీ విచార‌ణ కోరుతూ క‌విత ప్ర‌మేయంపై ఆరోప‌ణ‌లు చేస్తూ ఫిర్యాదు చేయ‌డం హాట్ టాపిక్ అయింది.

పేప‌ర్ లీకు స్కామ్   ఎమ్మెల్సీ క‌విత వైపు  (TSPS)

కాంగ్రెస్ నేత జ‌డ్స‌న్ చేసిన ఫిర్యాదు మేర‌కు 2016లో జ‌రిగిన‌ (TSPS) రివైస్డ్ మెయిన్ ఎక్సమ్ లో కల్వకుంట్ల కవిత పాత్ర ఉంద‌ని అనుమానించారు. ఆ మేర‌కు ఫిర్యాదులో ఆయ‌న పేర్కొంటూ విచారణ (Kavitha) చేయ్యాలని ఈడీ ని కోరారు. పిర్యాదు ఇలా ఉంది ` 2016లో రివైస్డ్ మెయిన్ ప‌రీక్ష‌కు 2011 Group1 నోటిఫికేషన్ సమయంలో లో రజనీకాంత్ రెడ్డి అనే అతను టీఎస్ పీఎస్ లో జూనియర్ అసిస్టెంట్. ఆ సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగి గా అతను గ్రూప్ 1 రాయకూడదు. కానీ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా ప‌నిచేస్తూ అతను స్టేట్‌ 4th ర్యాంక్ సాధించాడు. టాప్ టెన్ ర్యాంక్లో ఉన్న ముగ్గురు మొదటి ర్యాంక్ కోసం కల్వకుంట్ల కవిత కు కోటి రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. సాధారణంగా గ్రూప్1 మెయిన్స్ , ఇంటర్వ్యూ కలిపి 500 మార్కులు వస్తే ఎక్కువ. కానీ మొదటి ర్యాంక్ రావాలని 520కి పైగా మార్కులు వేశారు.

సీబీఐ, ఈడీకి కాంగ్రెస్ లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ 

`ఆరోజున స్టేట్ 2వ‌ ర్యాంకు సాధించిన అత‌ను . ( ఇతను కూడా మొదటి ర్యాంక్ కోసం ఒక TRS నాయకుడికి 50లక్షలు సమర్పించుకున్నాడ‌ని జ‌డ్స‌న ఆరోప‌ణ‌. ) విషయం లో సదరు నాయకుడు కవితతో(Kavitha) గొడవ పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ విషయం బయటకి వస్తుందని రాజీప‌డ్డార‌ని పొందుప‌రిచారు. ఇక స్టేట్ 3వ ర్యాంకు రజనీకాంత్ రెడ్డి, 4వ‌ ర్యాంక్. (టీఎస్ పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్. ఏ రకంగా చూసినా గ్రూప్ 1 ఉద్యోగం సాధించే నాలెడ్జ్ లేదు. కానీ ఆన్సర్ షీట్ నుండి మార్కులు కోడింగ్ చేసే క్రమంలో టాప్ 10 ర్యాంకుల్లో ఉండే విధంగా అతను మార్కులు వేసుకున్నాడు. ఇందుకు అప్పటి (TSPS) చైర్మన్ ను కూడా ఒప్పించాడు. బదులుగా “కల్వకుంట్ల కవిత ” కు చెందిన అభ్యర్థులు 23 మంది ఒకే సెంటర్ లో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు పోస్ట్ వచ్చే విధంగా మర్క్స్ కోడింగ్ లో అక్రమాలకి పాల్పడ్డాడు)“ అంటూ జ‌డ్స‌న్ ఫిర్యాదు చేయ‌డం దుమారం రేపుతోంది.

Also Read : KTR: TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ జరుపాలి

టాప్ లోని ముగ్గురు మరియు ఆ 23మంది జవాబు పత్రాలు మరియు వాళ్ళకి వచ్చిన మార్కులు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయ‌ని ఈడీని కోరారు. ఆ మెయిన్స్ కు(TSPS) సంబంధించి రెండు కేసులు హై కోర్ట్ లో వున్నా ప్రభుత్వం వాటిని బెంచ్ మీదకు రాకుండా చేస్తోంద‌ని జ‌డ్స‌న్ ఆరోపించారు.ఆర్టికల్ 318 మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 320లోని క్లాజ్ (3) మరియు A.P. రీ-ఆర్గనైజేషన్ చట్టం, 2014లోని సెక్షన్ 83 ప్రొవిజ‌న్ ద్వారా అందించబడిన గవర్నర్ అధికారాలను అమలు చేస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ 2014 ద్వారా G.O Ms No 44 జనరల్ అడ్మినిస్ట్రేషన్ 9Ser.A) తేదీ 08-08-2014.” ల‌బించింది. అయితే గవర్నర్‌కి కమిషన్‌ను ఫిక్స్ చేయడానికి మరియు అమలు చేయడానికి నేటికీ చాలా అధికారులు ఉన్నాయి.

యుటిలైజేషన్ సర్టిఫికేట్ మోసాలు  

డా. బి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత (TSPS) కమిషన్ అధికార రాష్ట్ర పార్టీచే రాజకీయ నియామకం మరియు నిబంధనల ప్రకారం 2014 (Go Ms No 44) నిబంధనల ఆధారంగా సభ్యులం స‌మ‌ర్థ‌త‌పై సందేహాస్పదంగా ఉంద‌ని జ‌డ్స‌న్ గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ఛైర్మన్ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా మరియు కాకతీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక ఉపకులపతిగా విఫలమయ్యార‌ని ఆరోపించారు. కొంతమంది TPSC సభ్యుల ప్రొఫైల్ కూడా అనర్హత మరియు కళంకిత నేపథ్యాల గురించి భయపడి వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడలేదని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫార్మసీ కళాశాలలో 1.18 కోట్ల మూలధన రుసుము కుంభకోణంలో నవీన్ మిట్టల్  తో డాక్టర్ జనార్దన్ రెడ్డి  ప్ర‌మేయం ఉంద‌ని తీవ్రంగా ఆరోపించారు. ఆ మొత్తం ఇప్పటికీ విద్యార్థులకు తిరిగి రాలేదని చెబుతున్నారు. UGC తప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికేట్ మోసాలు మరియు ప్రభుత్వానికి నోటీసు లేకుండా అనేక కళాశాల సేకరణలలో పేరు పొందారని గ‌వ‌ర్న‌ర్ కు తెలిపారు. ఆ చర్యల కోసం ఉన్నత విద్యా శాఖను అవినీతి లావాదేవీల విభాగంగా మార్చారని గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చిన విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు.

Also Read : TSPSC Group 1: బ్రేకింగ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ రద్దు.. ఏఈఈ, డీఏవో పరీక్షలు కూడా!

కుంభకోణం, దోషులు బుక్ అయ్యే వరకు టీఎస్ పీఎస్ ను ర‌ద్దు చేయాల‌ని గ‌వర్న‌ర్ ను బ‌క్కా జ‌డ్స‌న్ కోరారు.సైబర్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి. అన్ని TPSC సర్వర్‌లు తప్పనిసరిగా UGC నియంత్రణ డొమైన్‌లో ఉండాలి. ప్రశ్న పత్రాలు, పరీక్ష నిర్వహణ తప్పనిసరిగా UGC విజిలెన్స్ సెల్‌కు అప్పగించబడాలి. సమగ్రత, నిజాయితీ మరియు బాధ్యత కలిగిన కొత్త సమర్థులతో కూడిన క‌మిటీని టీఎస్పీఎస్ కు నియ‌మించాల‌ని కోరారు. మొత్తం ఎపిసోడ్ దర్యాప్తు కోసం సీబీఐకి తెలియ‌చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు. మొత్తం మీద టీఎస్పీఎస్ పేప‌ర్ లీకు వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న క‌ల్వ‌కుంట్ల రామారావును బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల నేత‌లు, నిరుద్యోగులు కూడా ప్ర‌భుత్వ తీరు మీద మండి పడుతున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా పేప‌ర్ లీకు చేసిన వ్య‌క్తితో క‌విత ఉన్న ఫోటోల‌ను ట్రోల్ చేస్తున్నారు.

గ్రూప్ 1, ఏఈఈ, డీఈవో, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు, డీఏవో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ TSPS  నిర్ణ‌యం తీసుకుంది. ఆ ప‌రీక్ష‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హిస్తారు? అనేది ప్ర‌క‌టించ‌లేదు. కానీ, గ్రూప్ 1 మాత్రం జూన్ 11న పెట్టేలా తేదీని ప్ర‌క‌టించిది. ఆ లోపుగా ఈడీ, సీబీఐ విచార‌ణ చేయాల‌ని జ‌డ్స‌న్ కోరుతున్నారు.

Also Read : TSPS : పేప‌ర్ లీక్ ర‌గ‌డ‌, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై విప‌క్ష దుమారం