TSPSC:ఉద్యోగాలు హుష్‌! పేప‌ర్ లీక్ తో సరి, మూడోసారికి స్కెచ్!

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వాకం మ‌లుపు తిరుగుతోంది.

  • Written By:
  • Updated On - March 20, 2023 / 02:02 PM IST

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వాకం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు, పుకార్ల మ‌ధ్య స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్, కానిస్టేబుళ్ల‌కు జ‌రిగిన ప‌రీక్ష‌ల(Exams)మీద కూడా అనుమానాల‌కు తావిస్తోంది. విప‌క్షాలు క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మండ‌ల స్థాయిలో ఉద్య‌మాన్ని తీసుకెళుతున్నాయి. ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా పేప‌ర్ లీకుల మీద ఉద్య‌మిస్తున్నాయి. ఒక వైపు హైకోర్టులో న్యాయ‌పోరాటానికి దిగుతూ క్షేత్రస్థాయి ఉద్య‌మాన్ని మ‌రింత ప‌దునెక్కిస్తున్నాయి. అటు రేవంత్ రెడ్డి ఇటు బండి సంజ‌య్ తెలంగాణ ప్ర‌భుత్వం మీద ప‌లు ఆరోప‌ణ‌ల‌కు దిగారు. మంత్రి కేటీఆర్ పీఏ సూత్రధారిగా పేప‌ర్ లీకులు ఉన్నాయ‌ని రేవంత్ రెడ్డి కొన్ని ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇక బీజేపీ మీద ఈ నిర్వాకాన్ని తోసేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న బీఆర్ఎస్ పార్టీని బండి సంజ‌య్ టార్గెట్ చేశారు. హోంమంత్రి మ‌హ్మ‌ద్ ఆలీ బంధువులు వంద‌లాది మంది టీఎస్ పీఎస్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ల‌బ్ది పొందార‌ని బీజేపీ ఆరోపిస్తోంది.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్  నిర్వాకం రోజుకో మ‌లుపు (TSPSC)

గ‌త ఏడాది అక్టోబ‌ర్ నుంచి జ‌రిగిన పేప‌ర్లు (TSPSC) అన్నీ నిందితుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌స్ట‌డీలో ఉన్నాయ‌ని తాజాగా విప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌. అత‌ని వ‌ద్ద‌కు పాస్ వ‌ర్డ్ ఎలా వ‌చ్చింది? ఎవ‌రు స‌హ‌కారం అందించారు? ఎన్ని పేప‌ర్లు లీక్ చేశారు? 2017 నుంచి ఈ తతంగం(Exams) జ‌రుగుతుంద‌ని వ‌స్తోన్న ఆరోప‌ణలు యువ‌త‌ను మ‌రింత క‌ల‌వ‌ర‌ప‌ర‌స్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాల‌ను కాంగ్రెస్ లీడ‌ర్ బక్కా జ‌డ్సన్ సీబీఐ, ఈడీకి అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీఎస్ పీఎస్ ఇటీవ‌ల నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసిన 8 ప‌రీక్ష‌ల‌కు సంబంధించి కేవ‌లం నాలుగు మాత్ర‌మే ర‌ద్దు చేసింది. మిగిలిన పేప‌ర్ల ప‌రిస్థితి ఏమిటి? అనేది చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో ప‌లువురు ఎంపిక కావ‌డం, కొన్ని మండ‌లాల్లో వంద‌లాది మంది ఉద్యోగాలు పొంద‌డం…త‌దిత‌ర అంశాల‌న్నీ తెర మీద‌కు వ‌స్తున్నాయి.

స‌బ్ ఇన‌స్సెక్ట‌ర్, కానిస్టేబుల్ పోస్టులకు జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో 

ఇటీవ‌ల జ‌రిగిన స‌బ్ ఇన‌స్సెక్ట‌ర్, కానిస్టేబుల్ పోస్టులకు జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో(TSPSC) అక్ర‌మాలు బోలెడు జ‌రిగాయ‌ని ఇప్పుడిప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తోంది. వాటి మీద ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి విచార‌ణ లేదు. క‌నీసం ఆరా కూడా తీయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. నాలుగు ప‌రీక్ష‌ల‌ను(Exams) ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మిగిలిన నాలుగు ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేసి మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2016 నుంచి టీఎస్ పీఎస్ నిర్వాకంపై సీబీఐ, ఈడీ విచార‌ణ జ‌రిపించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పేప‌ర్ లీకుల సూత్ర‌ధారులుగా మంత్రి కేటీఆర్ పీఏ తిరుప‌తి ఉన్నాడ‌ని రేవంత్ రెడ్డి తాజాగా చేస్తోన్న ఆరోప‌ణ‌. అందుకే, టీఆర్ఎస్ క్యాడ‌ర్ కుటుంబాల‌కు చెందిన వాళ్ల‌కు ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని సందేహాల‌ను లేపారు.

ప్ర‌భుత్వ పెద్ద‌ల భాగోతం బ‌య‌ట‌కు తీయాల‌ని (TSPSC)

ప్ర‌ధాన పార్టీలు పోటీపడి యువ‌త‌కు అండ‌గా ఉండేందుకు ముందుకు వ‌స్తున్నారు. గ‌త నాలుగు రోజులుగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీల చీఫ్ లు రంగంలోకి దిగారు. వాళ్లు దీక్ష‌ల‌కు దిగుతూ నిరుద్యోగుల‌ను ఉద్య‌మం వైపు తీసుకెళుతున్నారు. ఆ క్ర‌మంలో యువ‌త‌కు అండ‌గా నిలుస్తోన్న కొన్ని ఛాన‌ళ్లు, యూ ట్యూబ‌ర్స్ ను ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు భ‌య‌పెడుతున్నారు. వాళ్ల ఆఫీస్ ల మీద దాడుల‌కు తెగ‌బ‌డేలా ప్రోత్స‌హిస్తున్నారు. పేప‌ర్ లీకు(TSPSC) నిర్వాకం ప్ర‌భుత్వానికి చుట్టుకుంద‌ని గ్ర‌హించిన సీఎం కేసీఆర్ రివ్యూ స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నారు. నిరుద్యోగుల ఆగ్ర‌హాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, విప‌క్షాలు, విద్యార్థి సంఘాల నేత‌లు మాత్రం పేప‌ర్ లీకు (Exams)నిర్వాకంలోని ప్ర‌భుత్వ పెద్ద‌ల భాగోతం బ‌య‌ట‌కు తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సిట్టింగ్ జ‌డ్జి విచార‌ణ మాత్ర‌మే స‌రైన‌ద‌ని కోరుతున్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల త‌ప్పుగా మంత్రి కేటీఆర్ లైట్ గా పేప‌ర్ లీకు వ్య‌వ‌హారాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆ క్ర‌మంలో న్యాయ‌, క్షేత్ర‌స్థాయి పోరాటాల‌కు ప‌దును పెడుతోన్న విప‌క్షాలు, విద్యార్థి నేత‌లు మిగిలిన పేప‌ర్ల ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతున్నారు.

Also Read : TSPSC: టీఎస్పీఎస్సి పేపర్ లీక్ లో నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న సిట్?

మొత్తం తొమ్మిది మంది నిందితుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు సిట్ విచార‌ణ చేసింది. వాళ్ల నుంచి ప్రాథ‌మిక స‌మాచారం తీసుకున్న మేర‌కు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌వీణ్ సూత్ర‌ధారులుగా కొనుగొన్నారు. కానీ, సిట్ మీద విప‌క్షాల‌కు విశ్వాసం లేదు. ప్ర‌భుత్వం మాత్రం సిట్ విచార‌ణ‌కు పరిమితం అవుతోంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ అధికార‌, విప‌క్షాల మ‌ధ్య పేప‌ర్ లీకు (TSPSC)నిర్వాకం రాజ‌కీయ రాద్ధాంతంగా మారింది. ఫ‌లితంగా నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు వ‌చ్చే ప‌రిస్థితి ఇప్ప‌ట్లో కనిపించ‌డంలేదు. వాస్త‌వంగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన ప్ర‌కారం ల‌క్ష ఉద్యోగాలు తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. వాటిని భ‌ర్తీ చేసే క్ర‌మంలో ఇటీవ‌ల ఇచ్చిన నోటిఫికేష‌న్ల ద్వారా కేవ‌లం 8 నుంచి 10వేల ఉద్యోగాలు మాత్ర‌మే భ‌ర్తీ అవుతాయి. మిగిలిన 85వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి(Exams) ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. అందుకే, ఈ పేప‌ర్ లీకు గంద‌ర‌గోళాన్ని విప‌క్షాల మీద నెడుతూ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తుంద‌ట‌.

మంత్రి కేటీఆర్ పీఏ సూత్రధారిగా పేప‌ర్ లీకులు ఉన్నాయ‌ని(TSPSC)

ప్ర‌ధాన నిందితుల్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి బీజేపీ కార్య‌క‌ర్త అంటూ బీఆర్ఎస్ చెబుతోంది. కానీ, మంత్రి కేటీఆర్ పీఏ ద్వారా పేప‌ర్ లీకు (TSPSC)త‌తంగం అంతా న‌డిచింద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, నిందితుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సన్నిహితుడు అంటూ కొన్ని ఫోటోల‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. ఇలా ప్ర‌ధాన పార్టీలు ప‌ర‌స్ప‌రం పేప‌ర్ లీకు అంశాన్ని రాజ‌కీయం చేస్తూ ఎన్నిక‌ల దిశ‌గా వెళుతున్నాయి. ఫ‌లితంగా ఉద్యోగాల భ‌ర్తీ ఒక ప్ర‌హ‌స‌నంగా మార‌నుంది.

Also Read : TSPS : ఈడీ, సీబీఐకి పేప‌ర్ లీక్ ఎపిసోడ్‌, రాజ‌కీయ దుమారం