Group 1 : పాత అభ్యర్థుల సంగతేంటి ? గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వివరాలేంటి ?

Group 1 : 503 పోస్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌‌ను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. 563 పోస్టులతో కొత్తగా మరో  నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. 

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 08:27 AM IST

Group 1 : 503 పోస్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌‌ను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. 563 పోస్టులతో కొత్తగా మరో  నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.  మొత్తం 563 పోస్టుల్లో 209 ఓసీలకు, 49 ఈడబ్ల్యూఎస్‌లకు,  44 బీసీ(ఏ)లకు,  37 బీసీ(బీ)లకు, 13 బీసీ(సీ)లకు,  22 బీసీ(డీ)లకు,  16 బీసీ(ఈ)లకు,  93 ఎస్సీలకు,  52  ఎస్టీలకు,  24  దివ్యాంగులకు, 4 క్రీడాకారులకు రిజర్వ్ చేశారు. మొత్తం 18 శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా 140 ఎంపీడీవోల పోస్టులు, 115 డీఎస్పీ పోస్టులు, 48 సీటీవో పోస్టులు, 45 డిప్యూటీ కలెక్టర్ల, 4 ఆర్టీఓ, 41 గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో మార్పు(ఎడిట్‌)లకు అవకాశం కల్పిస్తారు. గ్రూప్-1 (Group 1) ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే లేదా జూన్‌‌లో, మెయిన్స్‌ ఎగ్జామ్  సెప్టెంబరు లేదా అక్టోబరులో జరుగుతుంది.  పరీక్షలకు వారం ముందు నుంచి పరీక్ష ప్రారంభ సమయానికి 4 గంటల ముందు వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఓఎంఆర్‌ విధానంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌) విధానంలో అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

Also Read : Farmers Vs Govt : రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 21 ఢిల్లీలోకి ప్రవేశిస్తామన్న రైతు సంఘాలు

గ్రూప్-1 షెడ్యూలు

  • కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్‌-1 (4/22 నోటిఫికేషన్‌)కు దరఖాస్తు చేసుకున్నవారూ పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే.
  • అయితే పాత అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్‌సీఎస్సీ పేర్కొంది.
  • టీఎస్‌సీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌)లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్‌ లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలి.
  • ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్‌, మొబైల్‌ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము రూ.200 కాగా, పరీక్ష రుసుము రూ.120.
  • నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థల/కార్పొరేషన్ల/ఇతర ప్రభుత్వ రంగాల ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • యూనిఫామ్‌ సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌(ఏఈఎస్‌), ఆర్టీవో పోస్టులకు కనిష్ఠ, గరిష్ఠ వయోపరిమితులు 21 నుంచి 35 ఏళ్లు కాగా.. మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వరకు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఆర్టీవో పోస్టుకు మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులన్నింటికీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏసీఎల్‌ పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్‌ వర్క్‌లో పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Also Read : Ambani Family: అంబానీ కుటుంబానికి చెందిన అల్లుడు, కోడళ్లు ఏం చేస్తారో తెలుసా..?