Site icon HashtagU Telugu

TSPSC -Group 1 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్

TGPSC NEW UPDATE

TSPSC -Group 1 : గ్రూప్‌ – 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ ను మరోసారి రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌ చేసింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ లంచ్‌ మోషన్‌ పిటిషన్ వేసింది. అయితే మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఇప్పటికే రెండుసార్లు ఎగ్జామ్ రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కారు హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రిలిమ్స్ పరీక్షను రెండున్నర లక్షల మంది అభ్యర్థులు రాశారని.. పరీక్ష సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టీఎస్ పీఎస్సీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో డివిజన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also read : Healthy Lungs : లంగ్స్ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?

2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటన (TSPSC -Group 1) వెలువడింది. దీనికి 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని 2023 జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. జూన్‌లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూలు రిలీజ్ చేశారు. అయితే ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో టీఎస్పీఎస్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది హాజరయ్యారు. ఏకంగా 52 వేల మంది ఈసారి ఎగ్జామ్ రాయలేదు.