Hyderabad: తెలంగాణాలో మైనారిటీ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేసింది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది కెసిఆర్ ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TSMFC) పథకం ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా’ కింద నిరుద్యోగ మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు లభిస్తాయి. ఈ పథకాన్ని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మ ద్ ఇంతియాజ్ ఇషాక్ ప్రారంభించారు, ఈ పథకం అమలు కోసం అన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులకు (DMWO) మార్గదర్శకాలను జారీ చేశారు.
‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు పంపిణీ జరగనుంది. ఈ సందర్భంగా చైర్మన్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. 2000 కుట్టు మిషన్లను క్రిస్టియన్ మైనారిటీల కోసం రిజర్వు చేసినట్లు తెలిపారు.
Read More: Dhanbad: బొట్టు పెట్టుకుని స్కూల్ కి వచ్చిందని విద్యార్థిని చితకబాదిన టీచర్.. చివరికి?