Site icon HashtagU Telugu

TS Model Schools : మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. రూల్స్ తెలుసుకోండి

Ts Model Schools

Ts Model Schools

TS Model Schools : తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 6వ తరగతి అడ్మిషన్లతో పాటు 7 నుంచి 10 తరగతుల్లోని ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు మార్చి 2తో ముగిసింది. తాజాగా ఈ గడువును మార్చి 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.  పరీక్ష ఫీజు కింద విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లిస్తే చాలు. మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎంపికయ్యే విద్యార్థుల లిస్టును మే 25న రిలీజ్ చేస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 – 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులను నిర్వహిస్తారు. మోడల్ స్కూళ్లలో  6వ తరగతిలో మొత్తం 19,400 సీట్లు ఉన్నాయి. 7 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 50 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్‌తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?