Site icon HashtagU Telugu

Belt Shops Close : తన పదవి పోయినా మంచిదే బెల్టు షాప్స్ మూయిస్తా – ఎమ్మెల్యే రాజగోపాల్

Belt Shops

Belt Shops

గత ప్రభుత్వం ప్రోత్సహం తో అడుగడుగునా బెల్టు షాప్స్ (Belt Shops) పుట్టుకొచ్చాయని..దీంతో యువత మద్యానికి బానిసై..అనేక నేరాలకు , ఘోరాలకు పాల్పడుతున్నారని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిందని..బెల్ట్ షాప్స్ ఫై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని , తన పదవి పోయినా మంచిదే బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం తన క్యాంపు ఆఫీస్ లో 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్టు షాపుల మూసివేత, గ్రామాల అభివృద్ధిపై సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… బెల్టు షాపుల విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉంటానని చెప్పుకొచ్చారు. మద్యం ఎక్కడపడితే అక్కడ దొరకడం వల్ల యువత తాగుడుకు బానిసలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం బెల్టు షాపులు ఉండకూడదన్నారు. బెల్టు షాపులను బంద్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ అంశం రాజకీయాలతో సంబంధం లేనిదని తేల్చి చెప్పారు. తాను మరోసారి చెబుతున్నానని.. తన పదవి పోయినా పర్వాలేదు కానీ బెల్టు షాపులు మాత్రం మూయాల్సిందే అన్నారు. 14కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో బెల్టు షాపులు లేవని.. బీఆర్ఎస్ వచ్చాక విచ్చలవిడిగా తయారయ్యాయన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఊర్లలో బెల్ట్ షాప్స్ అనేవి లేకుండా చేస్తామని రాజగోపాల్ అన్నారు.

Read Also : MLA Paidi Rakesh Reddy : రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది – ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్