అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ “ట్రంప్ ఆర్గనైజేషన్ (The Trump Organization)” ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) వైపు దృష్టి సారించింది. ఇప్పటికే ముంబై, పుణె, గుర్గావ్, కోల్‌కతా వంటి ప్రముఖ నగరాల్లో ట్రంప్ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన ఈ సంస్థ, ఇప్పుడు దక్షిణ భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో 63 అంతస్తులతో కూడిన జంట టవర్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. స్థానిక నిర్మాణ సంస్థ అయిన “ఐరా రియాల్టీ”తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు కూడా చేసిందని సమాచారం.
Dry Fruits: డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ట్రంప్ టవర్ల నిర్మాణం ద్వారా హైదరాబాద్ రియల్టీ రంగం మరింత ఉత్సాహం పొందనుంది. కోకాపేటలో ఇప్పటికే 57 అంతస్తులతో నిర్మించిన అత్యంత ఎత్తయిన భవనాన్ని మించి ఉండేలా ఈ జంట టవర్లు ఉండనున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు విశిష్ట గుర్తింపు లభించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కూడా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రంగం సిద్ధం చేస్తుండటం ఆసక్తికర పరిణామంగా మారింది. పశ్చిమ హైదరాబాద్‌లో భూముల కోసం చర్చలు జరుపుతుండటం నగరానికి మరో గౌరవం.
Spacecraft Crash : భూమిపైకి ‘కాస్మోస్ 482’.. భారత్‌లో పడుతుందా ?
ట్రంప్, అంబానీ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్(Hyderabad)కు వస్తుండటంతో ఇతర రాష్ట్రాలు, దేశాల సంస్థలు కూడా ఈ నగరంపై ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ రియల్టీ కంపెనీలు హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక్కడి స్థానిక నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా ప్రాజెక్టులు చేపట్టేందుకు చర్చలు జరుగుతున్నాయి. దీని వల్ల నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.