Press Meet: “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా?

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని "మీకేం పనిలేదా" అని అవమానిస్తారా?

  • Written By:
  • Publish Date - December 22, 2021 / 01:26 PM IST

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా? ఇది తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని హరీశ్ రావు అన్నారు. 

‘‘పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించు కావాలి.. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే వ్యవహరించారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రుల కంటే ఇంకా పెద్ద డెలిగేషన్ ఉంటుందా? రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని  కలువకుండా ముందు మీ బీజేపీ నేతలను పిలిపించుకుని మాట్లాడతావా? అని’’ ప్రశ్నించారు.

ధాన్యం కొంటారా కొనరా.. చెప్పండి అని మంత్రుల బృందం వస్తె.. కలవడానికి సమయం లేదు అంటారా. వానాకాలంలో మీరు ఇచ్చిన 40 LMT టార్గెట్ పూర్తయింది. ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం. మరో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా ఉంది. రైతులు చలిలో కల్లాల దగ్గర ఉంటున్నారు.  వీటిని కొంటారా కొనరా అని అడగడానికి మంత్రులు వస్తే అవమానిస్తారా. యాసంగి లో బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు.. భవిష్యత్తులో రా రైస్ కూడా కొనం అంటే ఏం చేయాలి? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

టీఆరెఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అందుకే డిల్లీ వచ్చాం. మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బీజేపీ కాదా? ఒక్క ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతం మీది అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత. మా పని మేము వంద శాతం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనవిధంగా ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. గోదాములు కట్టాం, మార్కెట్లు అభివృద్ధి చేశాం. రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందేలా చేస్తున్నామని పేర్కొన్నారు.

పోయిన వాన కాలం యాసంగి బియ్యమే ఇంకా ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. వ్యాగన్లు, గోదాములు ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు చెప్తే.. “మీరు ఒక్క లేఖ అయినా రాశారా” అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ఒకటి కాదు పది లేఖలు రాశాం. మేము బియ్యం ఇస్తాం మహాప్రభో తీసుకో.. హమాలీలు, టెక్నికల్ పర్సన్ ల సంఖ్యను పెంచుకో, గోదాములు లీజుకు తీసుకో అని చెప్తే పట్టించుకోలేదు. పైగా డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారు. చెత్త చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు.