తెలంగాణ(Telangana)లో మరోసారి నలుగురు ఐపీఎస్ (IPS) అధికారులను ( Officers) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన తర్వాత వరుసపెట్టి అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. ఇప్పటికే అనేక శాఖల్లో అధికారులను బదిలీ చేయగా..ముఖ్యంగా IPS ల విషయంలో వరుసగా బదిలీల పర్వం కొనసాగిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు స్థానంలో మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్‌ను నియమించింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా అకాంక్ష్ యాదవ్, మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్‌లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also : YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్