IPS Transfers : తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు

Published By: HashtagU Telugu Desk
Isa Badili

Isa Badili

తెలంగాణ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుండి ఐపీఎస్ అధికారుల బదిలీల పర్వం (IPS Transfers) కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈరోజు కూడా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌స‌భ‌ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున‌ బదిలీలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ బదిలీలు అయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌, సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌ సింగ్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే బదిలీ అయ్యారు. జోగులాంబ గద్వాల ఎస్పీగా టీ శ్రీనివాస్‌రావు, అవినీతి నిరోధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా రుతురాజ్‌ను నియమించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, బాలానగర్‌ డీసీపీగా కే సురేశ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా ధరావత్‌ జానకి, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్‌, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్‌ కంపాటి, శంషాబాద్‌ డీసీపీగా బీ రాజేశ్‌, మేడ్చల్‌ జోన్‌ డీసీపీగా ఎన్‌ కోటిరెడ్డిని నియమించింది.

వికారాబాద్‌ ఎస్పీగా కే నారాయణరెడ్డి, నల్గొండ ఎస్పీగా శరద్‌ చంద్రపవార్‌, రైల్వేస్‌ ఎస్పీగా చందనాదీప్తి, వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా షేక్‌ సలీమాను నియమించింది. యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య, హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌, డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని, మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్‌, జనగామ వెస్ట్‌జోన్‌ డీసీపీగా జీ రాజమహేంద్ర నాయక్‌ను నియమించింది. ఎల్‌ సుబ్బారాయుడిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Read Also : Wayanad Bypoll : అన్న స్థానంలో చెల్లి..

  Last Updated: 17 Jun 2024, 08:52 PM IST