Krishna Bhaskar : సీఎండి కృష్ణ భాస్కర్ కు భట్టి అభినందనలు

Krishna Bhaskar : అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా అభినందించిన ఉపముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు

Published By: HashtagU Telugu Desk
Krishna Bhaskar

Krishna Bhaskar

తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గౌరవాన్ని అందిస్తూ రాష్ట్ర ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ట్రాన్స్కో) సీఎండి కృష్ణ భాస్కర్ (State Transmission Corporation (Transco) CMD Krishna Bhaskar
) ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్‌ (World Bank Fellowship)కు ఎంపికయ్యారు. గణాంకాలు (స్టాటిస్టిక్స్) మరియు విశ్లేషణ (అనాలిటిక్స్) అంశాలపై ప్రపంచ బ్యాంకు ఈ ఫెలోషిప్‌ను నిర్వహిస్తోంది. Massachusetts Institute of Technology (MIT) లో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ పూర్తి చేసిన కృష్ణ భాస్కర్, తన ప్రాజెక్టు పనితనంతో ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 2,600 దరఖాస్తుల నుంచి కేవలం 33 మంది ప్రభుత్వ అధికారులను మాత్రమే ఎంపిక చేయగా, భారతదేశం నుంచి ఏకైక అధికారి కృష్ణ భాస్కర్ కావడం గమనార్హం.

Nagam Janardhan Reddy : చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ వెనుక అసలు కారణం..?

ఈ ఫెలోషిప్‌లో భాగంగా కృష్ణ భాస్కర్ వాషింగ్టన్ డీసీలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యక్ష శిక్షణ పొందనున్నారు. ఆపై వచ్చే ఆరు నెలల పాటు డిజిటల్ విధానంలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగంలో గణాంకాల ప్రాముఖ్యతను గుర్తించి ఈ రంగంలో ఉన్న అధికారులను ప్రోత్సహించేందుకు ప్రపంచ బ్యాంక్ ఈ ఫెలోషిప్‌ను అందిస్తోంది. ఈ కోర్సుకు సంబంధించిన మొత్తం వ్యయం ప్రపంచ బ్యాంక్ భరిస్తుంది. మార్చి 18 నుంచి 27 వరకు అమెరికాలో జరిగే ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమంలో కృష్ణ భాస్కర్ పాల్గొననున్నారు.

Amardeep : ఎవర్ని వదిలిపెట్టను అంటూ హెచ్చరించిన బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్

ఈ సందర్బంగా కృష్ణ భాస్కర్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అభినందించారు. భారతదేశం నుంచి ఒక్కరే ఎంపిక కావడం, అది కూడా తెలంగాణకు చెందిన ట్రాన్స్కో సీఎండీ కావడం గర్వించదగిన విషయమని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా అభినందించిన ఉపముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి తగిన విధంగా కృష్ణ భాస్కర్ మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  Last Updated: 13 Mar 2025, 08:23 PM IST