Site icon HashtagU Telugu

Sri Chaitanya College : శ్రీ చైతన్య కాలేజీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

Sri Chaitanya College Stude

Sri Chaitanya College Stude

హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో (Sri Chaitanya College) విషాద ఘటన తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ (Jaswant Goud
) అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య (Commit suicide) చేసుకున్నాడు. ఈ ఘటన ఈ ఉదయం వెలుగు చూసింది. అప్పుడు తోటి విద్యార్థులు నిద్రలేచి చూసినప్పుడు జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు.

మృతిచెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లా చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కుటుంబం, స్నేహితులు, కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి సమగ్ర విచారణ జరిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జస్వంత్ గౌడ్ కామారెడ్డి జిల్లా నుండి హైదరాబాద్ వచ్చి, ఇక్కడ కాలేజీలో చదువుతున్నాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలపై అంత ఆరాతీస్తున్నారు. ఇటీవలి కాలంలో, మానసిక ఒత్తిడి, పరీక్షల భయాలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు వంటి అంశాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఘటన ద్వారా విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టడం, సాయం అందించడం చాలా ముఖ్యమని అనిపిస్తోంది. కాలేజీల్లో మానసిక ఆరోగ్య సేవలు, కౌన్సెలింగ్ సేవలు పటిష్టం చేయడం అవసరమని విద్యార్థి సంఘాలు చెపుతున్నాయి.

Read Also : Nara Disti: మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ ఇంటికి నరదృష్టి తగిలినట్టే!