హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నగరంలో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ అడ్వజరీ జారీ చేశీఆరు. నారాయణగూడలోని వైఎంసీఏలో ఈ రోజు (మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సదర్ ఉత్సవ్ మేళా జరగనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాచిగూడ ఎక్స్ రోడ్ నుండి వైఎమ్‌సిఎ, నారాయణగూడ వైపు వాహనాలను అనుమతించడంలేదని పోలీసులు తెలిపారు. వీటిని కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లించనున్నారు. విట్టల్‌వాడి ఎక్స్‌రోడ్ నుండి వైఎమ్‌సిఎ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను రాంకోటి ‘ఎక్స్’ రోడ్ల వైపు మళ్లిస్తారు. అదేవిధంగా రాజ్‌మొహల్లా నుండి వాహనాలకు అనుమతి లేదు. వీటిని సాబూ షాప్ పాయింట్ వద్ద రాంకోటి ‘ఎక్స్’ రోడ్ల వైపు మళ్లిస్తారు. రెడ్డి కళాశాల నుండి వాహనాలను బర్కత్‌పురా వైపు మళ్లిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
పాత బర్కత్‌పురా పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను అనుమతించబోమని, క్రౌన్ కేఫ్ లేదా లింగంపల్లి వైపు మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, పాత ఎక్సైజ్ ఆఫీస్ లేన్ నుండి YMCA, నారాయణగూడ వైపు వచ్చే ట్రాఫిక్‌ను విట్టల్‌వాడి వైపు మళ్లిస్తారు. బర్కత్‌పురా చమన్ నుండి YMCA, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను బర్కత్‌పురా ‘X’ రోడ్ల వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. అలాగే, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ (నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) నుంచి రెడ్డి కాలేజీ వైపు వెళ్లే వాహనాలను నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్ల వైపు మళ్లిస్తారు.నగర వాసులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.
Also Read: Suicide : నరసరావుపేటలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య