Site icon HashtagU Telugu

Traffic Restrictions : రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions For Ba

Traffic Restrictions For Ba

రేపు సోమవారం బక్రీద్ (Bakrid ) పండగ. ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఈ పండగ సందడి మొదలైంది. ఈద్ ఉల్ జుహా, బక్రీద్, ఈద్ ఖుర్బాన్, ఖుర్బాన్ బైరామీ వంటి పేర్లతో ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. త్యాగానికి ప్రతీక గా ఈ పండగను జరుపుకుంటారు. ఖుర్బానీ ఇవ్వడం దీని ప్రత్యేకత. మాంసాన్ని దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక హైదరాబాద్ లో ఈ పండగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు.అలాగే- మసీదులు, ఈద్గాలకు దారి తీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను (Traffic Restrictions) విధించారు.

మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారిమళ్లిస్తామని ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్ పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తామని అధికారులు వివరించారు. ప్రార్థనల నిమిత్తం వచ్చే వారి వాహనాల పార్కింగ్ ను నెహ్రూ జూ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు ముందు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Read Also : Rushikonda : రుషికొండ ఫై ఉన్నవి ప్రభుత్వ భవనాలే – వైసీపీ ట్వీట్