Footpath Vendors : వీధి వ్యాపారులపై ట్రాఫిక్‌ పోలీసుల జులుం

Hyderabad : ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వందల సంఖ్యలో పుట్ పాత్ వెండర్స్ సామగ్రిని ట్రాఫిక్ పోలీసులు సీజ్‌ చేశారు

Published By: HashtagU Telugu Desk
Traffic Police Seize Belong

Traffic Police Seize Belong

హైదరాబాద్ (Hyderabad) కు వెళ్తే ఎలాగైనా బ్రతికేయొచ్చు..ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు..ఎక్కడో ఓ చోట తదాచుకోవచ్చు అనుకునే వారు..కానీ ఇప్పుడు ఆలా లేదు. ఎక్కడిక్కడే నిబంధనలు..రూల్స్ , లంచాలు ఇలా ఎటు చూసిన దోపిడే కనిపిస్తుంది. ఏ వ్యాపారం చేస్తే ఏ ప్రమాదం వస్తుందో..ఎక్కడ ఇల్లు కట్టుకుంటే హైడ్రా వచ్చి కూలుస్తుందో..రోడ్ పక్కన ఏదైనా టిఫిన్ సెంటర్ , చెప్పుల షాప్ ఇలా ఏది పెట్టిన ఎవరు వచ్చి కూల్చేస్తారో అని సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. కేవలం హైడ్రా (Hydraa) మాత్రమే కాదు ట్రాఫిక్ పోలీసులు సైతం కూల్చివేతలు చేస్తూ రోడ్డున పడేస్తున్నారు. తాజాగా వీధి వ్యాపారులపై(Street vendors) ట్రాఫిక్‌ పోలీసులు(Traffic police) జులుం చూపించిన ఘటన ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద చోటుచేసుకుంది.

ఐటీసీ కోహినూర్ హోటల్ (ITC Kohinoor Hotel)వద్ద ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వందల సంఖ్యలో పుట్ పాత్ వెండర్స్ సామగ్రిని ట్రాఫిక్ పోలీసులు సీజ్‌ చేశారు. వారు ఏసుకున్న టెంట్లను తొలగించారు. తమ సామగ్రిని ఇవ్వండి మీము వెళ్ళిపోతాం అని చెప్పిన కానీ పోలీసులు ఇవ్వకుండా తీసుకువెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. కుమారి ఆంటీకో న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలను చేసుకుంటున్న తమలాంటి వారిపై పోలీసుల దాడులు ఆపాలని బాధితులు కోరుకుంటున్నారు. ఇదేనా మార్పు అంటే..రేవంత్ అన్న వస్తే తమకు ఇంకా మంచి జరుగుతుందని భావిస్తే..మా పొట్ట మీదనే కొడుతున్నాడు ఇది న్యాయమా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు.

Read Also : Ntr On Drug Awareness : డ్రగ్స్‌కి బానిస కావద్దంటూ దేవర పిలుపు

  Last Updated: 25 Sep 2024, 01:45 PM IST