Site icon HashtagU Telugu

Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. ఫ్రీగా పంపిస్తున్న సిబ్బంది

Toll Plazas Rash

Toll Plazas Rash

పండుగల సీజన్ మొదలైన వెంటనే సొంత ఊళ్లకు వెళ్లి తిరిగి నగరానికి చేరుకుంటున్న వాహనదారుల వల్ల హైదరాబాద్‌ శివారు హైవేలపై ట్రాఫిక్ (Traffic) రద్దీ పెరిగిపోతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూ ఏర్పడుతోంది. ఇది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుండటమే కాకుండా రహదారి సురక్షతకూ సవాలు విసురుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. టోల్ ప్లాజాల (Toll Plaza) వద్ద వాహనాల క్యూ 100 మీటర్ల పసుపు గీతను దాటితే లేదా సాంకేతిక కారణాలతో ఒక వాహనం 10 సెకన్లకంటే ఎక్కువసేపు ఆగిపోతే ఆ వాహనాన్ని టోల్ లేకుండా వదిలేయాలని నిబంధనల్లో ఉంది. ఈ నిబంధనలు వాహనదారులకు ఉపశమనం కలిగించడమే కాకుండా టోల్ ప్లాజా వద్ద గుంపులు తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఉద్దేశ్యం.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపి కబురు..!

అయితే ఈ నిబంధనలు చాలాసార్లు ప్రాక్టికల్‌గా అమలుకావడంలేదని వాహనదారులు అంటున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది వీటిని పట్టించుకోకుండా వసూళ్లు చేస్తున్నారని, దీంతో ట్రాఫిక్ మరింతగా పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రూపొందించిన ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తే రద్దీ తగ్గడమే కాకుండా వాహనదారులకు సమయం, ఇంధనం రెండింటికీ ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version