Traffic Challans Website: ట్రాఫిక్ చలాన్స్ వెబ్‌సైట్ మొదటి రోజు క్రాష్

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్‌లను వసూలు చేయడానికి కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది . ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 26 నుండి అంటే నేటి నుండి జనవరి 10 వరకు ఈ స్కీం కొనసాగుతోంది

Traffic Challans Website: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్‌లను వసూలు చేయడానికి కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది . ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 26 నుండి అంటే నేటి నుండి జనవరి 10 వరకు ఈ స్కీం కొనసాగుతోంది, పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించవచ్చని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలకు 80 శాతం , ఇతర పెద్ద వాహనాలకు 60 శాతం రాయితీ ఇస్తారు.

తెలంగాణ ట్రాఫిక్ తీసుకున్న రాయితీ నిర్ణయం ద్వారా వాహనదారులకు కొంత ఊరట లభిస్తుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉదయం నుంచి ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు ఎగబడ్డారు. దీంతో ఈ-చలాన్ వెబ్‌సైట్ క్రాష్ అయింది. సైట్ లో వాహనం నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, వివరాలు కనిపించడం లేదు. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

2022లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని, ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు భారీగా సొమ్ము చేరిందని అధికారులు గుర్తు చేశారు. పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చిన వాహనదారులు, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్ల కారణంగా రాష్ట్ర ఖజానాలో 300 కోట్లు జమ అయ్యాయి.

Also Read: Skin Problems : చలికాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వీటిని తీసుకోవాల్సిందే..