Jagga Reddy Movie: తన రాజకీయ జీవితం ఆధారంగానే ‘‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’’ పేరుతో సినిమా తెరకెక్కుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ సినిమాలో ఉన్న కొట్లాటలు, ఫైట్లు కల్పితమైనవి కావని.. తన నిజ జీవితంలో జరిగినవే అని ఆయన తెలిపారు. శ్రీ విశ్వవసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో తన మూవీ యూనిట్ కార్యాలయాన్ని జగ్గారెడ్డి ప్రారంభించారు. ఆయన ఆయన విలేకర్లతో మాట్లాడారు.
Also Read :Shocking Incident : పుతిన్‌పై హత్యాయత్నం ? కారులో పేలుడు.. జెలెన్ స్కీ జోస్యం నిజమేనా ?
నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను : జగ్గారెడ్డి
‘‘ఎవరో రాసిన కథల్లో హీరోలు నటిస్తుంటారు. కానీ నేను అలా కాదు. నా జీవితంలో జరిగిన ఘటనలకు మాత్రమే నటిస్తున్నాను. నా సినిమా అంతా రియల్ స్టోరీ. ప్రతీ సీన్ వెనుక రియల్ కథ ఉంది’’ అని జగ్గారెడ్డి చెప్పారు. ‘‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’’ సినిమా కార్యాలయమే ఇకపై తన అడ్డా అని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, సక్సెస్ పుల్ ప్రయాణం సినిమాలోనూ అదే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను తెలుగు ప్రజలంతా చూస్తారన్నారు. ‘‘నేను విద్యార్థి నేతగా కెరీర్‌ను మొదలుపెట్టాను. నాపై ఎన్నో కుట్రలు చేశారు. కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశాను. ఆ క్రమంలో ఎన్నో కష్టాలు, బాధలను ఎదుర్కొన్నాను. ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తాను. నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ నేనే ప్లాన్ చేశాను’’ అని జగ్గారెడ్డి(Jagga Reddy Movie) తెలిపారు.
Also Read :Mann Ki Baat : ప్రధాని ‘మన్ కీ బాత్’లో.. ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. దాని విశేషాలివీ
రామానుజంతో ఓ ఫంక్షన్‌లో పరిచయం ఏర్పడి..
‘‘ఈ సినిమా డైరెక్టర్‌గా ఉండబోతున్న రామానుజంతో ఓ ఫంక్షన్‌లో నాకు పరిచయం ఏర్పడింది. తాను కొన్నేళ్ల క్రితం ఒక కథను రాసుకున్నానని, అందులో మీరు ఒక పాత్ర చేయాలని కోరుకుంటున్నానని రామానుజం నాతో చెప్పారు. ఆయన చెప్పిన పాత్ర, నా నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో.. అందులో నటించేందుకు నేను ఒప్పుకున్నాను. రామానుజం చూపించిన మూవీ పోస్టర్ నన్ను అట్రాక్ట్ చేసింది. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ సినిమాకు మూల కారకుడు డైరెక్టర్ రామానుజం’’ అని తూర్పు జగ్గారెడ్డి వివరించారు.