Site icon HashtagU Telugu

TPCC : ఈనెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..!

TPCC Meetings

TPCC Meetings

TPCC : ఈనెల 23న హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించబడనుంది. ఈ భేటికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీలో నూతనంగా నియమితులైన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.

Read Also: Vamsi Bail Petition : హైకోర్టులో వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ

మరోవైపు టీపీసీసీ కార్యవర్గ ప్రకటన తాత్కాలిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గా తమిళనాడుకు చెందిన సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నియమితులైన నేపథ్యంలో ఆమె రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాల సమాచారం. వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. గత నెలలో కేసీ వేణుగోపాల్ హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో వీలున్నంత త్వరగా పీసీసీ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కూడా రెండుమూడు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అయితే, ఈ జాబితా ఖరారవుతున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ మార్చటంతో జాబితా ప్రకటనను వాయిదా వేశారని తెలుస్తోంది.

Read Also: Delhi New CM: ఢిల్లీ న‌యా సీఎం రేఖా గుప్తా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?