TPCC President: తెలంగాణలో పదవుల జాతర మొదలుకానుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు (TPCC President) మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గాంధీ భవన్‌లో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు తీపికబురు వినిపించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఈనెల 27 తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రానున్నట్లు వెల్లడించారు. సంవిధాన్ బచావో ప్రదర్శనలో వారితో పాటు ఏఐసీసీ అగ్రనేతలు సైతం పాల్గొననున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ చిట్ చాట్‌లో ఆయన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ఆల్ఫోస్ విద్యా సంస్థల ఛైర్మన్ నరెందర్ రెడ్డి పేరు చాలా మంది తమకు చెప్పినట్లు మహేష్ కుమార్ తెలిపారు. అలాగే ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేటీఆర్‌పై, ఈ ఫార్ముల కారు రేస్‌పై స్పందించిన తీరు పట్ల మహేష్ కుమార్ తమ వైఖరి ఏంటో చెప్పారు. దానం నాగేందర్ వాఖ్యలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కేసీ వేణుగోపాల్ గట్టి వార్నింగ్ తమకు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉందన్నారు. ఈనెల14న ఢిల్లీకి వెళ్తున్నామని..15న ఏఐసీసీ ఆఫీస్ ప్రారంబోత్సవంలో పాల్గొంటామని ఆయన వివరించారు. ఈ నెల చివరి నాటికి పార్టీ కోసం ఇప్పటివరకు తీవ్రంగా కష్టపడి పని చేసిన వారికి పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. పని చేసిన కాంగ్రెస్ నాయకులకు పదవులు తప్పకుండా వస్తాయని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కార్పొరేషన్ పదవుల భర్తీ నెలఖారులోపు అయిపోతుందని ముగించారు.
Also Read: Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ!
లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు
మీడియాతో చిట్ చాట్‌కు ముందు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.