Revanth Reddy: కాంగ్రెస్ లో `భూ` కుంభ‌కోణం! రేవంత్ వ‌ద్ద సీనియ‌ర్ల అక్ర‌మాలు!!

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు నోరెత్త‌కుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి `భూ` చ‌క్రాన్ని సంధిస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 28, 2022 / 11:58 AM IST

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు నోరెత్త‌కుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి `భూ` చ‌క్రాన్ని సంధిస్తున్నారు. ఇంటి దొంగ‌ల వ్య‌వ‌హారాన్ని బయ‌ట‌కు లాగుతున్నారు. అక్ర‌మార్కుల జాత‌కాల‌ను బ‌య‌ట‌కు దోడుతున్నారు. ఆ మేర‌కు ఢిల్లీ నుంచి లాబీయింగ్ చేస్తూ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు రేవంత్ రెడ్డి ద‌డపుట్టిస్తున్నారు. అంత‌ర్గ‌తంగా పార్టీలో జ‌రిగిన అతి పెద్ద భూ కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌కు లాగుతున్నారు. ఆయ‌న దెబ్బ‌కు కాంగ్రెస్ తిమింగ‌లాలు బ‌య‌టప‌డ‌బోతున్నాయ‌ని టాక్‌.

సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఖ‌రీదైన ఆస్తులు కోకొల్ల‌లు. ప్ర‌త్యేకించి ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలోనూ విలువైన ప్రాంతాల్లో పార్టీ ఆఫీస్ కార్యాల‌యాలు ఉన్నాయి. రాష్ట్ర‌, జిల్లా కార్యాల‌యాలు అనేకం ఉన్నాయి. వాటికి సంబంధించిన స్థ‌లాలు కొన్ని వేల కోట్ల రూపాయ‌లు విలువ చేసేవి. ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ ప‌రిధిలోని కాంగ్రెస్ ఆస్తుల‌ను సీనియ‌ర్లు కొంద‌రు అనుభ‌విస్తున్నారు. గాంధీభ‌వ‌న్ ప‌రిధిలోని కొన్ని స్టాల్స్ నుంచి కాంగ్రెస్ భూముల‌కు సంబంధించిన ఆడిట్ జ‌ర‌గాలి. కానీ, కొనేళ్ల నుంచి సీనియ‌ర్లు కొంద‌రు వాటిని అనుభ‌విస్తూ త‌ప్పుడు ఆడిట్ ను అధిష్టానంకు ఇస్తున్నారు. స‌రిగ్గా ఇక్క‌డే మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డిని పాయింట్ బ్లాంక్ లో రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.

Also Read: Revanth on Marri : మర్రి శశిధర్ రెడ్డికి ఎయిడ్స్.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు!

ద‌శాబ్దాల పాటు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను అనుభ‌వించారు. తాజాగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి క్యాన్స‌ర్ సోకింద‌ని ఆరోపిస్తూ బీజేపీ గూటికి చేరారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం వెనుక అతిపెద్ద భూ కుంభ‌కోణం దాగి ఉంద‌ని రేవంత్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. గ‌త కొన్ని నెల‌లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాలు, షాపుల వివ‌రాలు, మెట్రో రైలు వేసే సంద‌ర్భంగా వ‌చ్చిన న‌ష్ట‌ప‌రిహారం వివ‌రాల గురించి రేవంత్ నిల‌దీస్తున్నారు. ఢిల్లీ నుంచి అధిష్టానం కూడా సీరియ‌స్ గా తీసుకుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఆయ‌న హ‌యాంలో ప్ర‌కృతి వైప‌రిత్యాల నివార‌ణ సంస్థ నిధుల దుర్వినియోగంపై కేంద్రం విచార‌ణ‌కు దిగింది. దీంతో ఆయ‌న క‌మ‌లం గూటికి వెళ్లార‌ని రేవంత్ చేసే ఆరోప‌ణ‌. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి క్యాన్స‌ర్ ఉంటే `మ‌ర్రి`కి ఎయిడ్స్ ఉంద‌ని దుమారం రేపుతూ పీసీసీ చీఫ్ చేసిన విమ‌ర్శ ప‌లువుర్ని ఆలోచింప చేస్తోంది.

మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సొంత స్థ‌లానికి భారీగా న‌ష్ట‌ప‌రిహారం ల‌భించింది. ఆ నిధులు ఎక్క‌డ ఉన్నాయో ఇంత వ‌ర‌కు తెలియ‌ద‌ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్రం నుంచి జిల్లాల వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తుల‌ను సీనియ‌ర్లు కొంద‌రు సుదీర్ఘ కాలంగా అనుభ‌విస్తున్నార‌ని పీసీసీ చీఫ్ తాజాగా తెలుసుకున్నారు. వాట‌న్నింటినీ బ‌య‌ట పెట్ట‌డానికి ఆయ‌న సిద్ధం అయ్యారు. ప‌క్కా ఆడిట్ జ‌రిగితే, కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ల భాగోతం బ‌య‌ట ప‌డ‌నుంది. ఫ‌లితంగా రేవంత్ రెడ్డి చెప్పే ఆ న‌లుగురి క‌థ ఇక ఖ‌త‌మ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read:  BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ