Site icon HashtagU Telugu

KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్

KTR open letter to Revanth Reddy Govt

KTR : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల  బీఆర్ఎస్ హయాంలో దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ.. గత 8 నెలలుగా విధ్వంసాన్ని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగాన్ని తెలంగాణ రాష్ట్రం చూసింది. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చింది’’ అని కేటీఆర్(KTR) ధ్వజమెత్తారు. ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు ఇది తొలి ప్రమాద సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.. నేడు సాగయ్యే భూవిస్తీర్ణం కట్’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Also Read :China Drone : సరికొత్త డ్రోన్ రెడీ.. ఆ విషయంలో అమెరికాను దాటేసిన చైనా

కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని, పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ తెలంగాణ సర్కారుకు లేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా లభించే పరిస్థితి లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని కేటీఆర్ విమర్శించారు.  ‘రైతు భరోసా’పై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తోందన్నారు. రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే తగిన శాస్తి చేస్తారని కేటీఆర్ కామెంట్ చేశారు. కేసీఆర్ హయాంకు, నేటి కాంగ్రెస్ హయాంకు ఉన్న తేడాను తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. రైతుల గోసను ఇప్పటికైనా పట్టించుకోవాలని కాంగ్రెస్ సర్కారును కేటీఆర్ కోరారు.

Also Read :ITBP Constable Jobs : 200 ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్