Old Vehicles : సెంటిమెంటు కావచ్చు.. ఇంకా ఇంజిన్ కండీషన్‌లోనే ఉందనే ఆలోచన కావచ్చు.. ఇలా కారణం ఏదైనా కావచ్చు.. నేటికీ తెలంగాణలో లక్షలాది మంది 15 ఏళ్లు దాటిన వాహనాలను వినియోగిస్తున్నారు. బాగా పాతపడిపోయిన 31 లక్షల పైచిలుకు బైక్‌లు, స్కూటర్లు రాష్ట్రంలో నేటికీ వినియోగంలో ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణలో ఇంచుమించు 42 లక్షలు ఉండగా.. వాటిలో 75.38 శాతం(31 లక్షలు) పాత బైక్‌లు, స్కూటర్లే ఉండటం గమనార్హం. పాత కార్లు దాదాపు 5.50 లక్షలకుపైనే ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన లక్షకుపైగా ఆటోలు, 5వేల విద్యాసంస్థల బస్సులు, 84వేల ట్రాక్టర్లు, ట్రాలర్లు ఉన్నాయి. ఈ పాత వాహనాలకు పెద్దగా ఫిట్‌నెస్ ఉండదు. వీటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ వాహనాల విషయంలో నూతన విధానాన్ని తీసుకురావడంపై తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టింది.
Also Read :10 Children Died: పండగపూట విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం!
కొన్ని వారాల కిందటే తెలంగాణ రవాణాశాఖ ‘స్క్రాప్ పాలసీ’ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. కాలం చెల్లిన వాహనాలను అప్పగిస్తే కొత్తగా కొనే వాహనంపై లైఫ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్సుపై నిర్ణీత శాతం మేర మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కొత్త వాహనాన్ని కొనేటప్పుడు పాత వాహనాన్ని ఇవ్వాలా ? వద్దా ? అనేది కొనుగోలుదారుడి వ్యక్తిగత ఇష్టం.
Also Read :Mokshagna : మోక్షజ్ఞ విలన్ గా స్టార్ హీరో కొడుకు.. అతన్ని ఎలా ఒప్పించారబ్బా..?
పాత వాహనాలను(Old Vehicles) నడపకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రస్తుతం రాష్ట్ర సర్కారు అన్వేషిస్తోంది. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇందుకోసం ఎలాంటి విధానాన్ని అవలంభిస్తున్నాయి అనే దానిపై ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఆయా చోట్ల ఏదైనా ఉత్తమ విధానం ఉంటే దాన్ని తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. 15 ఏళ్లు దాటిన వాహనాలపై గ్రీన్ ట్యాక్స్‌ను పెంచే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యం వెదజల్లే వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 23 లక్షలకుపైనే ఉంటాయని అంచనా.