Site icon HashtagU Telugu

Maoist Hidma : సీక్రెట్ బంకర్‌లో హిడ్మా.. కర్రె గుట్టలపై ఏం జరుగుతోంది ?

Maoist Hidma Secret Bunker Karregutta Telangana Border

Maoist Hidma : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దొరికిపోయాడా ? అతడు దాచుకున్న సీక్రెట్ బంకర్ ఆచూకీ దొరికిపోయిందా ? ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టల్లో భీకర ఎన్‌కౌంటర్ జరగబోతోందా ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు, పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండటంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూంబింగ్ జరిపే క్రమంలో ఏ క్షణమైనా మావోయిస్టులు తారసపడొచ్చని, ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ మొదలు కావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. మావోయిస్టు హిడ్మా అండ్ టీమ్ ఒక సీక్రెట్ బంకర్‌(Maoist Hidma)లో దాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. డ్రోన్లతో తీసిన వీడియో ఫుటేజీ ఆధారంగా ఈవిషయాన్ని గుర్తించారట.

Also Read :YS Jagan : ఎన్నికల వ్యూహకర్తతో జగన్ భేటీ.. ఫ్యూచర్ ప్లాన్‌పై కసరత్తు

భారీ సంఖ్యలో మావోయిస్టులు.. 

కర్రెగుట్టల్లో ఏకంగా 3వేల మంది మావోయిస్టులు ఉన్నారని వెల్లడైందట. ఇంతభారీ సంఖ్యలో ఉన్న మావోయిస్టులను ఏరిపారేయాలంటే కనీసం 5 వేల మంది భద్రతా బలగాలు అవసరం. కానీ అంతకంటే తక్కువ సంఖ్యలో భద్రతా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. భద్రతా బలగాలకు ప్రాణహానిని తగ్గించే క్రమంలో.. తక్షణమే కూంబింగ్ కోసం అదనపు సంఖ్యలో బలగాలను పంపాల్సిన అవసరం ఉంది. భద్రతా బలగాలకు రిస్క్ లేకుండా ఉండే వ్యూహాలను కర్రెగుట్టలపై అమలుపర్చాల్సిన అవసరం ఉంది.

Also Read :Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

మావోయిస్టులకు నీరు, ఆహారం అందకుండా.. 

కర్రెగుట్టలపై మావోయిస్టులు  బూబీ ట్రాప్స్, ప్రెషర్ కుక్కర్ బాంబులు, ఐఈడీలను అమర్చారని డ్రోన్ కెమెరా ఫుటేజీలతో వెల్లడైంది. అందుకే భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ వేగంగా ముందుకు సాగడం లేదు. భద్రతా బలగాలు ల్యాండ్ మైన్స్ ఉన్నాయో లేదో గుర్తిస్తూ..  చాలా జాగ్రత్తగా గుట్టలపైకి ఎంటర్ అవుతున్నాయి. పూర్తిగా గుట్టలపై పట్టు సంపాదించేందుకు భద్రతా బలగాలకు మరో ఐదారు రోజుల సమయం  పడుతుందని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో కర్రెగుట్టల చుట్టూ భద్రతా బలగాల ప్రత్యేక టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. గుట్టల నుంచి మావోయిస్టులు బయటికి వచ్చే దారులన్నీ మూసేశారు. నిత్యావసరాలు గుట్టపైకి వెళ్లకుండా ఆపుతున్నారు. నీరు, ఆహారం కోసం మావోయిస్టులు బయటికి వస్తే దాడి చేయాలనే వ్యూహంతో భద్రతా బలగాలు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల పరిధిలో దాదాపు 280 చదరపు కి.మీ మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి.