Drug Party : టాలీవుడ్ దర్శకుడు, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు

Drug Party : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 02:22 PM IST

Drug Party : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. దొరికిన వారిలో శేరిలింగంపల్లి బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు మంజీర మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్ ఉన్నారు. మాజీ సీఎం రోశయ్య మనవడు(Drug Party) కూడా ఉన్నాడట. ఇక అటు ఈ డ్రగ్స్ కేసులో మరోసారి మోడల్ లిషి గణేష్ దొరికిపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం రాడిసన్ హోటల్, మింక్ పబ్ డ్రగ్ కేసులో కల్లపు కుషిత, ఆమె సోదరి కల్లపు లిషి గణేష్ దొరికారు. లిషి గణేష్ తాజాగా ఇప్పుడు మరోసారి పట్టుబడింది. వీరిద్దరు గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన సమయంలో.. ‘‘మేం డ్రగ్స్ తీసుకోలేదు.. పార్టీకి వచ్చి ఛీజ్ బజ్జీలు మాత్రమే ఆర్డర్ ఇచ్చాం’’ అని తేల్చి చెప్పడం వైరల్ అయింది. ప్రస్తుతం కుషిత హీరోయిన్ గా టాలీవుడ్ చిన్న సినిమాల్లో నటిస్తోంది. లిషి గణేష్‌ యూట్యూబర్‌గానూ మంచి పేరు సంపాదించింది.

We’re now on WhatsApp. Click to Join

రాడిసన్ డ్రగ్స్ కేసులో కుషిత సోదరి, యూట్యూబర్ లిషి గణేష్‌ పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆ డ్రగ్స్‌ పార్టీకి ఆమె కూడా వెళ్లినట్లు గుర్తించారు. లిషి గణేష్‌తోపాటు FIR లో శ్వేతా అనే మరో వీఐపీ అమ్మాయి పేరును కూడా చేర్చారు. లిషి గణేష్‌ను పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా అరెస్ట్ అయిన కేదర్నాథ్, నిర్భయ్‌లు సొంత పూచీకత్తుపై బెయిల్ మీద సోమవారమే విడుదలయ్యారు. మరో నిందితుడు వివేకానందకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. దీన్నిబట్టి ఈ కేసులో ఉన్నవారు ఎంత పవర్ ఫుల్ వ్యక్తులో అర్థం చేసుకోవచ్చు.

Also Read : First Class Admission : ఆ ఏజ్ నిండితేనే ఫస్ట్‌ క్లాస్‌ అడ్మిషన్‌.. రాష్ట్రాలకు కేంద్రం లెటర్

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు

తాజాగా ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. రాడిసన్​ బ్లూ హోటల్‌లో పార్టీ జరిగేటప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన వివేకానందతో క్రిష్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుల జాబితాలో క్రిష్ పేరును చేర్చారు.డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. తన ఫ్రెండ్స్ పిలవడం వల్లే పార్టీకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. తన డ్రైవర్ రాగానే అక్కడి నుండి వెళ్లిపోయానని తెలిపారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వివరణ ఇచ్చారు.

ఈ కేసులో ఇద్దరు అమ్మాయిలతో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్.. అబ్బాస్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్ మీద కేసు నమోదు చేశారు. ఇక ఇదే కేసులో ఒక టాలీవుడ్ నిర్మాత పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన నిర్మాతగా ఇంకా సినిమాలు మొదలు పెట్టలేదు. 2020లో ఒక స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇక ఆయన మరో స్టార్ హీరోకి వ్యాపార భాగస్వామి అని కూడా చర్చ జరుగుతోంది. ఇక మరో వ్యాపారవేత్త సందీప్ మీద కేసు నమోదు చేశారు. శ్వేత అనే సెలబ్రిటీతో పాటు లిశిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో నీల్ అనే వ్యక్తితో పాటు ఖుషి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పది మంది కలిసి డ్రగ్ తీసుకున్నట్లుగా గుర్తించారు. బయట నుంచి అబ్బాస్ డ్రగ్స్ తెచ్చాడని, కొకైన్ పేపర్ రోల్ లో చుట్టి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు.