Site icon HashtagU Telugu

Tollywood : సీఎం రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల భేటీ..

Congress

Congress

తెలంగాణ ముఖ్యమంత్రి (CM Revanth Reddy) గా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి ని వరుసపెట్టి సినీ ప్రముఖులు (tollywood celebrities) కలుస్తూ అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నటులు మెగా స్టార్ చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ , వెంకటేష్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేయగా..ఆదివారం పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి ని కలిశారు.

We’re now on WhatsApp. Click to Join.

టాలీవుడ్‌లోని వివిధ శాఖలకు చెందిన పలువు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. రేవంత్ ను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి ,తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ వంటి ప్రముఖులు ఉన్నారు.

Read Also : Mrunal Thakur : వాళ్లపై ఘాటు కామెంట్స్ ఈ వీడియో వైరల్ అవుతుందని చెప్పి మరి షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..!

Exit mobile version