Site icon HashtagU Telugu

Toll Charges Hike : ‘టోల్‌’ తీసేందుకు ముహూర్తం ఫిక్స్.. ఛార్జీల పెంపు వివరాలివే

Toll Tax

Toll Tax

Toll Charges Hike : దేశవ్యాప్తంగా జూన్ 2 నుంచి టోల్‌ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి.  వాస్తవానికి  ఏప్రిల్ 1 నుంచే ఈ ఛార్జీలు పెరగాలి. కానీ ఎన్నికల కోడ్ కారణంగా టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)  ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరిదైన ఏడో విడత పోలింగ్ జూన్‌ 1న జరగనుంది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్‌ ప్లాజా ఛార్జీలు పెరుగుతాయి. దీనిపై ఇప్పటికే NHAI నుంచి టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు అందాయి. టోల్‌ ప్లాజా ఛార్జీల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. ఏటా జాతీయ రహదారుల నిర్వహణ అవసరాల కోసం టోల్ ప్లాజా ఛార్జీలను పెంచుతుంటారు.