OP Services Bandh : ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు(OP Services Bandh) స్తంభించాయి. కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఈరోజు నిరసన తెలుపుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ముందస్తు నోటీసు కూడా అందించారు. దీనివల్ల ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై వైద్యాధికారులు ఫోకస్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రోజున (ఆగస్టు 12న) కూడా దేశవ్యాప్తంగా పలు వైద్యసేవలను బంద్ చేశారు. ఆ రోజున ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురయ్యారు. ఆగస్టు 12న పలు అత్యవసర సేవలకు వైద్యులు మినహాయింపు ఇచ్చారు.
Also Read :Congress: తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. రేసులో ఆ ముగ్గురు
ఇక కోల్‌కతా ఘటన వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 8న రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలు తన జూనియర్లతో కలిసి భోజనం చేసింది. అనంతరం సెమినార్ హాల్‌లోకి వెళ్లి నిద్రపోయింది. మరుసటి రోజు(ఆగస్టు 9న) ఉదయం అదే సెమినార్ హాల్‌లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు, కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు అధికారులకు పోలీసులు సమన్లు ఇచ్చారు. వీరిని దర్యాప్తు చేసి మరిన్ని వివరాలను తెలుసుకోనున్నారు. సదరు జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులకు కాల్ చేసిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అధికారులు ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో విభిన్నమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. జూనియర్ వైద్యురాలి మర్మాంగాలు, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం జరిగిందని గుర్తించారు. మెడ, కాళ్లు, చేతులు, గోళ్లకు గాయాలున్నట్లు వెల్లడైంది. ఇది ఆత్మహత్య కాదని.. లైంగిక దాడి చేసి చంపారని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఆస్పత్రిలో అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.