Rain Alert Today : ఇవాళ 16 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు

Rain Alert Today :  వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలో అనేక చోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - July 23, 2023 / 08:24 AM IST

Rain Alert Today :  వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలో అనేక చోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి (మూడు రోజులు) కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ఈనెల 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీవర్షాలు (ఆరెంజ్ అలర్ట్ ) అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 5 రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ (Rain Alert Today) మెదక్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వికారాబాద్, జనగాం, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Also read : Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..!

హైదరాబాద్ టుడే..  

‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. సిటీలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలులు నైరుతి దిశ నుంచి గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో తెలిపారు.

Also read : Prime Minister since 1985 : 38 ఏళ్లుగా ఆయనే ప్రధాని.. ఇకపై ఆయన కొడుకట.. నేడే కాంబోడియా పోల్స్

ఏపీ టుడే..  

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వచ్చే మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కి మీల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని పేర్కొంది.

Also read : Mexico Bar: అమెరికాలో విషాద ఘటన.. బార్‌కు నిప్పంటించడంతో 11 మంది మృతి