బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఇద్దరు ఎక్కడ తగ్గేదేలే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి టార్గెట్ ఒక్కటే అదే తెలంగాణ లో అధికారం చేపట్టడం. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్..మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే..తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో రాష్ట్రం అప్పులపాలైందని , నిరుద్యోగ యువతకు జాబ్స్ ఇవ్వలేదని ..ప్రాజెక్ట్ ల పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ..ప్రజల్లో మార్పు కోరుతుంది కాంగ్రెస్. ఇలా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు , విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక గత కొద్దీ రోజులుగా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారం చేస్తుండగా..రేవంత్ కాంగ్రెస్ విజయభేరి యాత్ర చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు ఇరు నేతలు నాల్గు నియోజకవర్గాలను కవర్ చేయబోతున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో జరగబోయే ప్రజా ఆశీర్వద సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇటు రేవంత్ నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఆలేరు బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3.30కి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొని సభలో ప్రసంగించనున్నారు.
Read Also : Chappal Thrown On Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై చెప్పుల దాడి..అంటూ పాత వీడియో వైరల్