Whats Today : అమిత్ షా, గడ్కరీ, నిర్మల సుడిగాలి పర్యటన.. ఖమ్మంలో అజారుద్దీన్ ప్రచారం

Whats Today : కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 20, 2023 / 10:46 AM IST

Whats Today : కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. ఈరోజు ఆయన రెండు బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జనగామలో జరిగే సభలో పాల్గొటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కోరుట్లలో జరిగే సభకు వెళ్తారు. సాయంత్రం ఉప్పల్‌లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.

  • ఇవాళ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు.
  • నితిన్ గడ్కరీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఎల్లారెడ్డి, మధ్యాహ్నం 2 గంటలకు కొల్లాపూర్ బహిరంగ సభలకు హాజరవుతారు. సాయంత్రం ఉప్పల్ రోడ్ షోలో పాల్గొంటారు.
  • ఇవాళ నిర్మలా సీతారామన్ జూబ్లీహిల్స్, మల్కాజిగిరి నియోజకవర్గాలలో పర్యటిస్తారు. పురందేశ్వరి మహేశ్వరంలో పర్యటిస్తారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ఉదయం 10.30కి ముషీరాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు.
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24, 25 తేేదీల్లో తెలంగాణకు వస్తారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ 21న, స్మృతి ఇరానీ 25, 26 తేదీల్లలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24, 25, 26 తేదీల్లో తెలంగాణకు వస్తారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
  • ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.
  • ఇవాళ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తరపున మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ బహిరంగసభ, మధ్యాహ్నం 3 గంటలకు పరకాల బహిరంగసభ, సాయంత్రం 6 గబటలకు ఖైరతాబాద్ రోడ్ షో, రాత్రి 8 గంటలకు నాంపల్లి రోడ్ షోలో పాల్గొంటారు.
  • ఈనెల 23 నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని టీటీడీ ప్రారంభించనుంది.
  • ఇవాళ ఖమ్మంలో కాంగ్రెస్ నేత అజారుద్దీన్, మధ్యప్రదేశ్ ఎంపీ ఇమ్రాన్ కలిసి ఎన్నికల ప్రచారం(Whats Today) నిర్వహిస్తారు.

Also Read: 22 Crores : ఈ విస్కీబాటిల్ 22 కోట్లు.. ఎందుకు ?