Nagarjuna Sagar 70 Years : నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1955 సంవత్సరం డిసెంబరు 10వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యాక.. 1967 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారికంగా ప్రారంభించారు. నెహ్రూ మాట్లాడుతూ.. జల ప్రాజెక్టులను దేశంలో ఏర్పాటు కాబోతున్న ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాలను జల సిరులతో సస్యశ్యామలం చేస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇవాళ 70వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈసందర్భంగా కథనమిది.
Also Read :20 Wives VS Husband : 20 మంది ఆధ్యాత్మిక భార్యలు.. మత నాయకుడికి 50 ఏళ్ల జైలుశిక్ష ?
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విశేషాలు..
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత కట్టడం(Nagarjuna Sagar 70 Years). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం.
- నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భాగంగా 110 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన జలాశయం ఉంది. గరిష్ట నీటి సాయి మట్టం 590 అడుగులు. దీనికి 408 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది.
- ఈ ప్రాజెక్టులో 26 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక డిశ్చార్జి సామర్ధ్యం కలిగిన కాలువగా కుడి కెనాల్‌కు పేరుంది.
- ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రోజుకు 45వేల మంది కార్మికులు 12 ఏళ్ల పాటు శ్రమించారు.
- దీని నిర్మాణ పనుల్లో మొత్తం 19.71 కోట్ల మంది పాల్గొన్నారు.
- అప్పట్లో నాగార్జున సాగర్ కట్టడానికి రూ.98 కోట్లే ఖర్చయ్యాయి.
Also Read :Harmeet Dhillon: భారత వనిత హర్మీత్‌కు కీలక పదవి.. ట్రంప్ ప్రశంసలు.. ఆమె ఎవరు ?
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీటిని అందిస్తుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు కూడా ఇస్తుంది.
- నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600గ్రామాలకు తాగునీరు అందుతుంది.
- జాతీయ గ్రిడ్ కోసం విద్యుత్ ఉత్పత్తికి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. కుడి కాలువ విద్యుత్తు కేంద్రం ద్వారా 90 యూనిట్లు, ఎడమ కాలువ ద్వారా 60 యూనిట్ల విద్యుత్తు, మెయిన్ పవర్ హౌజర్ నుంచి 815మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
- కరువు పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మారుతోంది.