Thummala : తుమ్మల సంచలన కామెంట్స్..నేను గెలిస్తే ఏపీలో బాబు గెలిచినట్లే..

ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఏపీ లో చంద్రబాబు గెలిచినట్లేనన్నారు

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 03:34 PM IST

తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao)- టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ లో చేరిన తుమ్మల..ఎన్టీఆర్ (NTR) మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో పలు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగానూ పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసారు. మొదటి నుండి కూడా బాబు తో తుమ్మల కు సాన్నిహిత్యం ఉంది. 2018 లో బిఆర్ఎస్ లో చేరినప్పటికీ..బాబు తో అనుబంధాన్ని మాత్రం తెచ్చుకోలేదు.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా బాబు అరెస్ట్ (Chandrababu Arrest) ను సైతం తుమ్మల ఖండించడం జరిగింది. ప్రస్తుతం తుమ్మల కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. బిఆర్ఎస్ నుండి పువ్వాడ బరిలోకి దిగాడు. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి గా మారింది. ప్రచారంలో ఇద్దరు కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఒకరి ఫై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ తరుణంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఏపీ (Andhra Pradesh) లో చంద్రబాబు (Chandrababu) గెలిచినట్లేనన్నారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే తన ఆలోచన అని స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయాన్ని ఉంచుకోనన్నారు. టీడీపీ పార్టీకి తాను చాలా రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు. వాస్తవానికి ఖమ్మం లో ఎక్కువ శాతం ఏపీ సెటిలర్స్ ఉంటారు. వీరంతా కూడా టీడీపీ కి సపోర్ట్ గా ఉంటారు. అందుకే తుమ్మల వారి ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Congress Rebels Withdraw Nominations : రెబల్స్ ను బుజ్జగించే పనిలో మాణిక్ రావ్ ఠాక్రే