Site icon HashtagU Telugu

2024 Indian General Election : పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ..

Parliament Elections Palamu

Parliament Elections Palamu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Indian General Election) మొత్తం స్థానాలు కైవసం చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ముఖ్యంగా పట్టున్న స్థానాల్లో కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాలమూరు (Palamuru MP Constituency) స్థానం కైవసం చేసుకుంటామని బిజెపి ధీమాగా ఉంది. దీంతో ఈ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ పడుతున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి (Jithender Reddy), రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ లు ఈ ముగ్గురు పాలమూరు టికెట్ ను ఆశిస్తూ..ఎవరికీ వారు నాకు వస్తుందంటే..నాకు వస్తుందంటే ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీసీ కోటాలో తప్పనిసరిగా తనకు అవకాశం కల్పించాలని శాంత కుమార్ పార్టీ అధిష్టానాన్ని గట్టిగా అడుగుతున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం తమది అంటే.. తమది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నేతలు పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అన్నది అక్షర సత్యం. ఈ ఎన్నికలలో అందుకు భిన్నంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంత మాట్లాడుకుంటున్నారు.

ఇక బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో..ఈ ఎన్నికల్లో కూడా అలాగే విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా గా ఉంది. మరోపక్క బిఆర్ఎస్ ఎక్కడైతే ఓటమి చవిచూసామో..మళ్లీ అక్కడే గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తప్పిదం జరగడం తోనే బిఆర్ఎస్ ఓటమి చవిచూసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పు జరగదని ప్రజల్లో నమ్మకం ఉన్న వ్యక్తినే బరిలో దింపుతామని చెపుతుంది. మరి ఏంజరుగుతుందో..ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Read Also : VV Vinayak : వైసీపీ లోకి డైరెక్టర్ వి.వి. వినాయక్..?

Exit mobile version