ఆందోల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి (Andole EX Mla Kranthi Kiran Chanti)కి బెదిరింపు కాల్స్ (Threats ) .. దళిత బంధు (Dalith Bandhu)లో కమీషన్లు తీసుకున్నావ్ అంటూ పలు పిర్యాదులు రావడం ఫై ఆయన అసహనం వ్యక్తం చేసారు. గత రెండు రోజులుగా ఓ ఫోన్ నుండి పదే పదే కాల్స్ వస్తున్నాయని..సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు..ఆ డబ్బులు మీరే ఇవ్వాలని..లేదంటే సోషల్ మీడియా లో బద్నామ్ చేస్తానని ఓ వ్యక్తి బెదిరిస్తున్నట్లు చంటి పోలీసులకు పిర్యాదు చేసాడు. అసలు సదరు వ్యక్తి తనకు తెలియదని..అయనప్పటికీ కలుద్దాం రమ్మని చెప్పినప్పటికీ పదే పదే కాల్స్ చేస్తూ విసిగిస్తున్నాడని చంటి ఫిర్యాదులో పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే మరో వ్యక్తి దళిత బంధులో కమీషన్లు తీసుకున్నానంటూ తనపై పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు నిన్న నే నా దృష్టికి వచ్చింది. ఈ పిర్యాదులు, బెదిరింపు కాల్స్ ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగమే. అయినప్పటికీ ఆరోపణలపై విచారణకు నేను సిద్ధంగా వున్నాను.నిజాలు నిగ్గుతేల్చడానికి ‘లై” డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని.. దానికి నేను సిద్ధంగా ఉన్నాను.. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి కి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి ఫిర్యాదులోని వాస్తవాన్ని ఫిర్యాదు వెనకాల ఉన్న కుట్రను ఛేదించాలని పోలీస్ లను కోరుతున్నాను. ఆందోల్ నియోజకవర్గంలో అధికార ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట. తప్పుడు కేసులతో మా కార్యకర్తలను వేధించడం..మా కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయించడం..అంతే కాకుండా మా పార్టీ మహిళ కార్యకర్తల ఇళ్లలోకి జోరబడి వారిపై కోడి గుడ్లతో దాడి చేయడం చేస్తున్నారు. రాత్రి పూట నాయకుల ఇళ్ల పైకి టపాసులు విసురుకుంటు వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు, కార్ల కింద టపాసులు పేల్చుకుంటు సదరు ఎమ్మెల్యే అనుచరులు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి రాయలసీమ ఫ్యాక్షన్ గ్రామాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు మా ఆందోల్ లో ఏ గ్రామంలో చూసిన ఇదే పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు గడవక ముందే ఇలా దాడులు చేయడం..అధికారులను బెదిరింపులతో తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. పోలీస్ అధికారులను సైతం బెదిరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రశాంతంగా పనిచేసుకొని పరిస్థితి లేకుండా చేస్తున్నారు. గ్రామాల్లో రాజకీయంగా ఆయనకు దీటుగా నిలబడ్డందుకే తప్పుడు ఆరోపణలతో కేసు లు పెట్టిస్తున్నాడు. జీతం మీద మాత్రమే ఐదేళ్లు గడిపిన చరిత్ర నాది. నేను ఎలాంటి వాన్నో నాతో కలిసి న ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా బదనాం చేయడమే లక్ష్యంగా కొందరిని లోబరుచుకుని, ప్రలోభపెట్టి ఇలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నిష్పక్షపాత విచారణ జరగాలని నిజాలు నిగ్గుతేలాలని డిమాండ్ చేస్తున్నట్లు క్రాంతి కిరణ్ చంటి పేర్కొన్నారు.
Read Also : TDP vs Janasena: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు?