Site icon HashtagU Telugu

Hyderabad; హైదరాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్: అరెస్ట్

Hyderabad

Hyderabad

Hyderabad; శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఇమెయిల్‌లు పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు .విమానాల్లో హైజాకర్ల గురించి గతంలో రెండుసార్లు శంషాబాద్ విమానాశ్రయానికి మెయిల్స్ పంపారు. ఆ మెయిల్స్ కారణంగా పోలీసులు విచారణ చేపట్టారు.

వైభవ్ తివారీ పంపిన ఈ మెయిల్స్ నకిలీవని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు వైభవ్ బెంగుళూరులో పట్టుబడ్డాడు. అయితే ఇలా ఎందుకు చేశావని పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు తెలిపాడు వైభవ్. కరోనా కారణంగా ఐటీ ఉద్యోగం కోల్పోయానని, దీంతో డిప్రెషన్‌ కారణంగా ఈమెయిల్స్ పంపానని వైభవ్ తివారి పోలీసులకు చెప్పాడు. వైభవ్ సమాధానానికి పోలీసులు కంగుతిన్నారు. అయితే అతడికి కౌన్సిలింగ్ అవసరమని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Raviteja Eagle : ఈగల్ లేటెస్ట్ కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసిన మాస్ రాజా..!