Threat : సీఎం రేవంత్ కు బెదిరింపు లేఖలు..అసలు ఏంజరుగుతుంది…?

Threat : “మేము నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం…” అంటూ ప్రారంభమైన ఈ లేఖల్లో ముఖ్యమంత్రిని తీవ్రంగా హెచ్చరించారు

Published By: HashtagU Telugu Desk
Threat Letter

Threat Letter

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) చర్చలు ఊపందుకుంటున్న వేళ, మక్తల్ నియోజకవర్గం (Maktal Constituency)లో బెదిరింపు లేఖలు (Threatening Letters) వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను హెచ్చరిస్తూ వచ్చిన ఈ లేఖలు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. “మేము నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం…” అంటూ ప్రారంభమైన ఈ లేఖల్లో ముఖ్యమంత్రిని తీవ్రంగా హెచ్చరించారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి రాకుండా చేశారనే అభిప్రాయంతో ఈ హెచ్చరికలు వచ్చాయని తెలుస్తోంది.

Aprilia Tuono 457 : తిరుపతిలో అందుబాటులోకి వచ్చిన అప్రిలియా టుయోనో 457

ఈ లేఖలపై మరింత చర్చ జరగడానికి కారణం, అవి ముదిరాజు సామాజిక వర్గం పేరుతో రాయబడడమే. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. లేఖలు ఎవరు రాశారు? ఎందుకు రాశారు? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో మక్తల్ నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఇక మరోవైపు ముదిరాజు సంఘం నేతలు ఈ లేఖలపై స్పందిస్తూ తమ సామాజిక వర్గానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ పేరును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, పోలీసులకు అధికారిక ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, లేఖలు ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? ఎవరు పంపించారు? అనే దానిపై దృష్టి సారిస్తున్నారు.

  Last Updated: 18 Apr 2025, 04:09 PM IST