Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి !

Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి.

  • Written By:
  • Updated On - January 26, 2024 / 04:22 PM IST

Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఇప్పటిదాకా  రెండు మాత్రమే అమలు చేశారు. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వచ్చే నెలలో ఇంకో రెండు స్కీమ్స్‌ను అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆ రెండు స్కీమ్స్ ఏమిటి అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఆ రెండు స్కీమ్స్ కూడా మహిళా వర్గానికే సంబంధించినవే అని  అంటున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం(Rs 2500 To Women) వచ్చే నెలలో అమల్లోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ అమలుకు నిధులు ఎక్కువగా అవసరమున్నందున మార్చి నెలాఖరు నాటికి మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తారని అభిప్రాయపడుతున్నారు. రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేసే స్కీమ్ కూడా ఫిబ్రవరి నుంచే అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.  ఏ లెక్కన చూసుకున్నా..  రూ.500కు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ అందించే స్కీమ్‌తో పాటు ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీం‌ను అమలు చేసేందుకే ఎక్కువ ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే వీటిలో ఏ స్కీమ్ అమలుకు సీఎం రేవంత్  సర్కారు మొగ్గుచూపుతుందో తెలియాలంటే ఇంకొన్ని వారాలు వేచిచూడాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join.

  • కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇంకా చాలా పథకాలు ఉన్నాయి.
  • రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15వేలు, కూలీలకు రూ.12వేలు ఇవ్వాలి.
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది.
  • యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు హామీ కూడా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది.
  • చేయూత పథకం కింద వృద్ధుల నెలవారీ పెన్షన్‌ను రూ. 4,000కు పెంచుతామని కాంగ్రెస్ చెప్పింది. ఆ పథకం అమలు కూడా మిగిలి ఉంది.
  • 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలే అభయహస్తం దరఖాస్తులను  రాష్ట్ర సర్కారు స్వీకరించింది.  ప్రస్తుతం ఈ అప్లికేషన్లు ప్రాసెసింగ్ దశలో ఉన్నాయి. వీటిని పరిశీలించి అర్హులను గుర్తించనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్చిలోగానే ఇవన్నీ అమల్లోకి తేవాలి. లేదంటే ఉచిత హామీల అమలుకు బ్రేక్ పడుతుంది.