Ration Cards: మీకు రేషన్ కార్డు ఉందా ? రేషన్ కార్డులో పేర్లు ఉన్నవాళ్లంతా ఈ-కేవైసీ చేయించుకున్నారా ? ఒకవేళ ఇప్పటిదాకా చేయించుకోకుంటే.. ఇప్పుడైనా రేషన్ షాపునకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోండి. ఆధార్ నమోదు కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా మనం రేషన్ కార్డుకు సంబంధించిన ఈ-కేవైసీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏప్రిల్ 30. అందరూ ఆలోగా ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి. లేదంటే రేషన్ కార్డుల్లో పేర్లు ఉండవు.
Also Read :Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు
ఈ-కేవైసీ ఎందుకో తెలుసా ?
జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సబ్సిడీ పంపిణీలో మోసాలను అరికట్టేందుకే రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఈ-కేవైసీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారి పేర్లను, దేశంలోని లేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఎంతో సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి ఈ-కేవైసీ గడువు మార్చి 31తోనే ముగిసింది. అయితే ప్రజల సౌకర్యార్ధం ఏప్రిల్ 30 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత గడువును పెంచే అవకాశం లేదని తెలుస్తోంది.
Also Read :Tamilisai : తమిళనాడు బీజేపీ చీఫ్ రేసులో తమిళిసై.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే
బీఆర్ఎస్ హయాంలో.. అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే.. మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేయొచ్చు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి తగిన మార్పులు చేస్తారు. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కనీసం రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో ఎంతోమంది చనిపోయిన వారి పేర్లు కూడా కార్డుల్లో అలాగే ఉండిపోయాయి. ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తయ్యాక.. అలాంటి వాళ్ల పేర్లన్నీ తొలగిపోతాయి. ఫలితంగా కొత్త రేషన్ కార్డుల జారీకి లైన్ క్లియర్ అవుతుంది.