Bathukamma Sarees : నేటి నుంచే చీరల పంపిణీ.. 25 రంగులు, 25 డిజైన్లు, 625 కలర్ కాంబినేషన్లు

Bathukamma Sarees : ఈరోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Indiramma Sarees

Indiramma Sarees

Bathukamma Sarees : ఈరోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో 1.02 కోట్ల చీరలను టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌ శాఖ పంపిణీ చేయనుంది. రేషన్ దుకాణాల ద్వారా ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు ఫోన్ నెంబర్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఈ చీరల స్టాక్ అయిపోయే వరకు  పంపిణీ చేయనున్నారు. ఈసారి 25 రంగులు, 25 డిజైన్లు, 625 కలర్ కాంబినేషన్లతో బతుకమ్మ చీరలను తయారు చేయించారు. వెండి, బంగారు, జరీ అంచులతో ఈ  శారీలను నేశారు. థ్రెడ్‌ బార్డర్‌తో 100 శాతం పాలిస్టర్‌ ఫిలిమెంట్‌ నూలును చీరల్లో వాడారు.

We’re now on WhatsApp. Click to Join

సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, గర్షకుర్తి, జమ్మికుంట, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ధర్మపురిలోని చేనేత కార్మికులు ఈ చీరలను తయారు చేశారు.  మొత్తం 1.02 కోట్ల చీరలలో 98 శాతం చీరలను మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే తయారు చేయడం గమనార్హం.  మొత్తం 139 మ్యాక్స్ సంఘాలు, 126 ఎస్ఎస్ఐ(స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్) ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16వేల మరమగ్గాలతో చీరెలను తయారు చేయించామని, సుమారు 20వేల మంది కార్మికులకు (Bathukamma Sarees)  ఉపాధి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

Also read : Amitabh Bachchan: వివాదంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అసలేం జరిగిందంటే..?

  Last Updated: 04 Oct 2023, 10:58 AM IST