Celebrities Vote : రేపే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. భాగ్య నగరంలో ఎన్నో రంగాల ప్రముఖులు నివసిస్తుంటారు. ఇలాంటి సెలబ్రిటీలు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలు సిటీలో చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు లాంటి వాళ్లు ప్రతిసారి ఎన్నికల్లో ఓటు వేసే పోలింగ్ కేంద్రాలు(Celebrities Vote) కొన్ని ఉన్నాయి. వాటి వద్ద పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
- చిరంజీవి, రాంచరణ్‌లు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రంలో మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
- జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి కలిసి వెళ్లి ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేయనున్నారు.
- అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌లు తమ ఓటును బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో వేయనున్నారు.
- మహేశ్‌బాబు, నమ్రత, మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్‌లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయా చోట పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించనున్నారు.
Also Read :Kharges Helicopter : ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఎన్డీయే నేతల హెలికాప్టర్లను చెక్ చేయరా ? : కాంగ్రెస్
హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో జరిగే పోలింగ్ ప్రక్రియను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాలను దాదాపు 5,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. 3,783 పోలింగ్ కేంద్రాల్లో 50 నుంచి 100 గజాలలోపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ చేశారు. పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఐటీ వింగ్‌ను నియమించారు. మౌంటెడ్ కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కి లింక్ చేశారు. ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా వెంటనే అలర్ట్ అవుతారు. అందుకు 4,000లకు పైగా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్‌లెస్ సెట్‌లను సిబ్బందికి అందజేశారు.మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల లోక్‌సభసెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 4,496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బందోబస్తుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కేటాయించారు.