New MLCs : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు షాక్ తగిలింది. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి గెలిచారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతుతో మల్క కొమరయ్య గెలిచారు. వీరి నేపథ్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Ayodhya’s Ram Mandir : అయోధ్య ఆలయంపై దాడికి పాకిస్థాన్ కుట్ర
పింగిళి శ్రీపాల్‌రెడ్డి గురించి..
- పింగిళి శ్రీపాల్‌రెడ్డి(New MLCs) 1973 ఫిబ్రవరి 2న జన్మించారు.
- తల్లిదండ్రుల పేర్లు సరస్వతి, రాంరెడ్డి.
- మహబూబాబాద్ జిల్లా గూడురు గ్రామంలో జన్మించారు.
- భార్య పేరు నవిత, కుమారుడు లక్ష్మీనందు, కుమార్తె శ్రీ వైష్ణవి.
- 1996లో నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో ఉన్న గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కెరీర్ ప్రారంభమైంది.
- 2000 సంవత్సరంలో నెక్కొండ పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
- తదుపరిగా పీఆర్‌టీయూలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.
- 2003లో స్కూల్ అసిస్టెంట్(గణితం)గా పదోన్నతి వచ్చింది.
- నెక్కొండ, శాయంపేట మండలాల్లో విధులు నిర్వహించారు.
- హైదరాబాద్‌లో డిప్యూటేషన్‌పై స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు.
- ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
- 2019 నుంచి ఇప్పటి వరకు పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేశారు.
- ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం 11,281 (50శాతం) మొదటి ప్రాధాన్య ఓట్లు రావాలి. అయితే పింగిళి శ్రీపాల్‌రెడ్డికి(పీఆర్‌టీయూటీఎస్) అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనను విజేతగా ప్రకటించారు.
Also Read :BJLP : ఇక మారేది తెలంగాణ ముఖ్యమంత్రే : మహేశ్వర్ రెడ్డి కీలకవ్యాఖ్యలు
మల్క కొమరయ్య గురించి..
- మల్క కొమరయ్య 1959 అక్టోబరు 1న జన్మించారు.
- పెద్దపల్లి పురపాలిక పరిధిలోని బంధంపల్లిలో ఆయన స్వగ్రామం.
- తల్లిదండ్రుల పేర్లు లక్ష్మమ్మ, వెంకటయ్య.
- భార్య పల్లవి, కుమారుడు యశస్వి, కుమార్తె త్రిభువన.
- సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో నివసిస్తున్నారు.
- కొమరయ్య ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే పల్లవి విద్యా సంస్థలు ప్రారంభించారు. కుమారుడు, కుమార్తె విద్యాసంస్థలను పర్యవేక్షిస్తుంటారు.
- హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పర్యవేక్షణ కొమరయ్యనే చూస్తారు.
- గతంలో కొమరయ్య బీజేపీ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
- ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య, పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.