KTR : ఇది ప్రజల పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్‌

ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్

Published By: HashtagU Telugu Desk
Rakhi To KTR

This is not people's rule.. Revenge rule: KTR

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే..ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ కెటిఆర్ మండిపడ్డారు.
ప్రజావాణి దరఖాస్తులపై శ్వేతపత్రం విడుదలకు ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్..ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాభవన్ కు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆమె జీతం రూ.15 వేలు కాగా, జీతంలో కోత పెట్టి ఏజెన్సీ రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో ఆమె ప్రజాభవన్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ మరుసటి రోజు రేణుకను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువగా ఉందని విమర్శించారు. ఇది ప్రజల పాలన కాదని.. ప్రతీకార పాలన అని అన్నారు. రేణుకను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దర్బార్ ద్వారా ఎంతమంది పేదల సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Lasith Malinga Birthday: యార్కర్ కింగ్ లసిత్ మలింగ బర్తడే స్పెషల్

  Last Updated: 28 Aug 2024, 04:38 PM IST