Telangana Assembly : తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం అందిస్తాం. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం అన్నారు.
Read Also: Walking : వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు
రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున వారికి అందిస్తున్నాం. రైతు నేస్తం అమలు చేస్తున్నాం. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్‌గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అని గవర్నర్ అన్నారు. రాష్ట్రానికి రైతులే ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అన్నదాతలకు రుణమాఫీ చేశాం. ఇదే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించామన్నారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ పురోగమించడమే కాదు.. రూపాంతరం చెందుతోందన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్‌తో పని చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని, తెలంగాణ భౌగోళిక పాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ స్థిరత్వం, దృఢసంకల్పానికి గుర్తు అన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ గురువారానికి వాయిదా పడింది.