KCR Third Front : జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో జత కట్టకుండా.. వచ్చే ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ చూపించాలన్నారు. మూడో కూటమి లీడర్ గా కేసీఆర్ ఉంటే బాగుంటుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. కేసీఆర్, మాయావతి లాంటి నేతలు కాంగ్రెస్, బీజేపీ కూటముల్లో లేరని.. అలాంటి నాయకులు మూడో కూటమిలో చేరాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డాలన్నారు.
Also read :Ganesh Chaturthi: 300 ఏళ్ల తర్వాత గణేష్ చతుర్థి సందర్భంగా ఆ రాశుల వారి జీవితాలు అద్భుతాలు?
ముస్లిం రిజర్వేషన్‌ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు ?
హైదరాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ వర్గింగ్ కమిటీ సమావేశాలపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్‌లు పెంచాలని చెబుతున్న కాంగ్రెస్…ముస్లిం రిజర్వేషన్‌ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లోనూ తాను దీనిపై కాంగ్రెస్ ను ప్రశ్నించానని (KCR Third Front) తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ముస్లిం రిజర్వేషన్ల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.కశ్మీర్‌లో జవాన్లు అమరులవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడకపోవడం దారుణమని మజ్లిస్ చీఫ్ విమర్శించారు.