English Oath : ఇంగ్లిష్‌లో ప్ర‌మాణం చేసిన ఎమ్మెల్యేలు వీరే

English Oath : తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేల‌కుగానూ 99 మంది ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

  • Written By:
  • Updated On - December 9, 2023 / 06:57 PM IST

English Oath : తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేల‌కుగానూ 99 మంది ప్ర‌మాణ స్వీకారం చేశారు.  వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 60 మంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 32 మంది, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆరుగురు, సీపీఐ ఎమ్మెల్యే ఒక‌రు ఉన్నారు. ఇక ఏ భాషలో ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారనేది పరిశీలిస్తే.. ఎక్కువమంది తెలుగులోనే ప్రమాణం చేశారు. 15 మంది ఆంగ్లంలో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇంగ్లిష్‌లో ప్ర‌మాణం చేసిన వారిలో లాస్య నందిత, ప‌ద్మావ‌తి రెడ్డి, అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, బండారి ల‌క్ష్మారెడ్డి, గ‌డ్డం వినోద్, మ‌ధుసూద‌న్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంక‌టేశ్‌, ప్రేమ్ సాగ‌ర్ రావు, ల‌క్ష్మీకాంతారావు, మ‌ద‌న్ మోహ‌న్ రావు, ముఠా గోపాల్, మైనంప‌ల్లి రోహిత్, తెల్లం వెంక‌ట్రావ్, గ‌డ్డం వివేక్ ఉన్నారు. ఎంఐఎం నుంచి గెలుపొందిన అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, జాఫ‌ర్ హుస్సేన్, కౌస‌ర్ మొయినుద్దీన్, జుల్ఫీక‌ర్ అలీ, మ‌హ్మ‌ద్ మాజీద్ హుస్సేన్, మ‌హ్మ‌ద్ మోబిన్ ఉర్దూలో ప్ర‌మాణం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కాగా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. చేయూత, మహాలక్ష్మి స్కీమ్ పథకం అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సభను డిసెంబర్ 14కు వాయిదా వేశారు.  ప్రస్తుతం ప్రమాణస్వీకారం చేయని వారి ప్రమాణస్వీకారం తర్వాత ఉంటుందని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు.  ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉంటే అసెంబ్లీకి రామని.. ప్రమాణం చేయమని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. దీంతో బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రాలేదు.

Also Read: Death Signs In Shiva Purana: మృత్యువు సమీపించేటప్పుడు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసా?

ఇక సోమవారం రోజు స్పీకర్ ఎన్నిక కోసం బులెటిన్ విడుదల కానుంది. స్పీకర్ నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు ఉంటుంది. ఈనెల 14న గురువారం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 15న (గురువారం) స్పీకర్ ఎన్నిక జరగనుంది. 16న (శుక్రవారం) అసెంబ్లీ, మండలి జాయింట్ సెషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించనున్నారు. శనివారం రోజు గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాల తీర్మానం జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. స్పీకర్ రేసులో కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ పేరు ఖరారైందని(English Oath) తెలుస్తోంది.